రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
ఇచ్చోడ మండలంలోని దాబా బి గ్రామంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవితం పై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. మృతుని భార్య మాన్నే ఆశాబాయి మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలం దాబా బి గ్రామానికి చెందిన మాన్నే గోవింద్(46) గత ఆరు సంవత్సరాలుగా అస్తమ తో పాటు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఎన్ని ఆసుపత్రిలు తిరిగిన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆరోగ్యం విషయంలో తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు . అయితే గత నాలుగు రోజుల నుండి అర్షమొలల నుండి రక్తస్రావం తీవ్రం కావడంతో ఆ నొప్పి భరించలేక పోతున్నానని భార్య తో చెప్పుకునేవాడు. అయితే ఆదివారం రొజు ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో క్షణికావేశంలో గుర్తుతెలియని పురుగుల మందు తాగినాడు. భర్త వాంతులు చేసుకోవడం చూసి కంగారు పడిన ఆశాబాయి కుటుంబ సభ్యులకు తెలపడం తో పురుగుల మందు వాసనా రావడం తో చికిత్స కోసం ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రికు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Recent Comments