🔶 ఇచ్చోడ, బోథ్ మండలాల ఎంపిపి ల ఔదర్యం….
🔶 25 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేత
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : కొద్దిరోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లో మారుతి గూడా మారుమూల ఆదివాసి గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం లేక నిండు గర్భిణీ అయినా ఆదివాసీ మహిళా మెస్రం భీంబాయి వైద్యం అందక మృతి చెందిన విషయం తెలుసుకున్నా ఇచ్చోడా ఎంపిపి నిమ్మల ప్రితం రెడ్డి, బోథ్ ఎంపిపి తుల శ్రీనివాస్ లు చెరో రూ. 25000 చొప్పున రూపాయలు 50 వేల నగదును బాధిత కుటుంబానికి అందించారు. కుటుంబ పోషణ కొరకుఆర్థిక సహాయాన్ని అందించి వారు మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. మళ్లీ ఏ మాతృమూర్తికి కూడా ఇలాంటి ప్రమాదం పునరావృతం కాకుండా ఉండాలని తమ ఎంపిపి పరిధిలోప్రాంతం కాకపోయినప్పటికీ ఆ సంఘటన వారి హృదయాన్ని కలిసి వేసిందని ఆవేదన చెందినారు.
ఇట్టి కార్యక్రమంలో జడ్పి చైర్మన్ జనార్ధన్ రాథోడ్ , ఏఐటీడీఏ చైర్మన్ లక్కే రావు తాంసి జడ్పిటిసి రాజు, దుర్గం శేఖర్, మర్సు కోలా తిరుపతి, ఆదివాసి మహిళలు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments