A1 కు – 3 సం”లు జైలు శిక్ష మరియూ రూ 6000/- జరిమానా
A2,A3,A4 లకు – 1 సం” జైలు శిక్ష మరియూ చెరో రూ 2000/- జరిమానా
తీర్పు వెలువరించిన అసిస్టెంట్ సేస్సన్స్ జడ్జి జి ఉదయ భాస్కర్ రావు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
సోమవారం స్థానిక జిల్లా అసిస్టెంట్స్ స్టేషన్స్ న్యాయస్థానం నందు జడ్జి జి ఉదయ భాస్కర్ రావు గాయపరిచిన కేసు లో తీర్పును వెలువరించారు.
*కేసు వివరాలు*
గత 14 సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్ నుండి వచ్చి ఆదిలాబాద్ పట్టణంలోని తిరుపెల్లి లో నివాసం ఏర్పరచుకొన్న నిషాద్ వినోద్ తన భార్యా పిల్లలతో ఉంటుండగా, అదే కాలనీకి చెందిన ఆకతాయిలు రోజు రాత్రి ఇంటి ముందర వాటర్ ట్యాంక్ వద్ద కూర్చుని ఇబ్బంది చేస్తుంటే నిలదీసి నందుకు. తేదీ 31.12.2014 రాత్రి 8 గంటల 30 నిమిషాలకు
A1- మహమ్మద్ అమీర్,
A2 – షేక్ ఆసిఫ్,
A3 – షేక్ అకీల్,
A4 – షేక్ సలీం
నలుగురు వ్యక్తులు నిషాద్ వినోద్ ఇంట్లో కాంపౌండ్ గోడ దూకి లోనికి వెళ్లి ఎందుకు గొడవ చేసినావు అని అల్లరిచేస్తూ పక్కనే ఉన్న ప్లాస్టిక్ బకెట్ తో నిషాద్ వినోద్ ఇష్టంవచ్చినట్లు కొట్టి గాయపరిచారు, మరియు అడ్డం వచ్చిన తన భార్య గర్భవతి అని కూడా చూడకుండా ఆమెను, అతని తమ్ముడగు నిషాద్ శాంతారామ్ లను కూడా కొట్టినారు. రెండు రోజుల తర్వాత తన భార్యకు చనిపోయిన పాప పుట్టింది.
ఈ సంఘటనపై నిషాద్ వినోద్ దరఖాస్తు మేరకు అప్పటి ఎస్ఐ జె రాము కేసు నమోదు చేయగా cr no 2/2015,U/sec 448,324,316 R/w 34 కింద కేసు నమోదు చేసి అప్పటి సిఐ కే బుచ్చిరెడ్డి దర్యాప్తు చేయగా, సిఐ ఎం వెంకటస్వామి దర్యాప్తు నివేదికను కోర్టులో సమర్పించారు.
ఈ కేసు నందు అదనపు పీపీ ఈ కిరణ్ కుమార్ రెడ్డి 15 మంది సాక్షులను విచారించి నేరం రుజువు చేయగా అసిస్టెంట్ స్టేషన్స్ జడ్జి శ్రీ జి ఉదయ భాస్కర్ రావు శిక్ష విధిస్తూ *A1- మహమ్మద్ అమీర్* కు sec 448,324,IPC కింద 3 సం”ల సాధారణ జైలు శిక్ష, రూ 6,000/- జరిమానా కట్టని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష విధించడం జరిగింది, మరియు *A2 – షేక్ ఆసిఫ్,A3 – షేక్ అకీల్,A4 – షేక్ సలీం* లకు ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ 2,000/- జరిమానా కట్టని పక్షంలో లో ఒక నెల జైలు శిక్ష విధించారు. ఇట్టి కేసు నందు కోర్టు లైజన్ ఆఫీసర్ ఎం గంగా సింగ్, కోటి డ్యూటీ అధికారులు ఎం శ్రీనివాస్, అశోక్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments