— జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి బాధ్యతలు స్వీకరించిన ఆదిలాబాద్ నూతన డిఎస్పి వెలగల ఉమేందర్
— ఆదిలాబాద్ సబ్‌డివిజనల్ పోలీసు అధికారిగా బాధ్యతలు స్వీకరించిన వెలగల ఉమేందర్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఇటీవలే సాధారణ బదిలీల్లో భాగంగా ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎన్ఎస్వీ వెంకటేశ్వరరావు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం వెలగల ఉమేందర్ ను నియమించినది. అందులో భాగంగానే నూతన డీఎస్పీ గురువారం డీఎస్పీ ఆఫీస్ లో ఛార్జ్ తీసుకున్న అనంతరం జిల్లా ఎస్పీని పుష్ప గుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సబ్‌డివిజనల్ ప్రాంతంలో గల విషయాలపై చర్చించి, నూతనంగా విచ్చేసిన డి.ఎస్.పి కి తగు సూచనలు చేశారు.
నూతనంగా విచ్చేసిన డి.ఎస్.పి, యాదాద్రి భువనగిరి జిల్లా కు చెందిన ఆలేరులో జన్మించి, 1995 సం”లో పోలీస్ శాఖలో ఎస్సైగా నియమితులై హైదరాబాద్‌లోని సంతోష్ నగర్, నల్లకుంట, టాస్క్‌ఫోర్స్, జూబ్లీహిల్స్ లాంటి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి 2008 సంవత్సరంలో సీఐగా పదోన్నతి పొంది తదుపరి నాంపల్లి, సైఫాబాద్, రాజేంద్రనగర్ లో తన విధులను నిర్వర్తించారు. 2018 సం” లో డీఎస్పీ గా పదోన్నతి పొంది గోదావరిఖని ఏసీపి గా విధులు నిర్వహించారు. చివరగా ప్రస్తుతం హైదరాబాద్ సి ఐ డి లో నిర్వర్తించ గా ఆదిలాబాద్ డి ఎస్ పి గా స్థానచలనం జరిగిందని తెలిపారు.


Recent Comments