Friday, March 14, 2025

CrimeNews: వివాహితను అత్యాచారం చేసిన నిందితుడికి పదేళ్ల కఠిన కారాగారా శిక్ష

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ క్రైం :

వివాహితురాలుని కిడ్నాప్ చేసి, బెదిరించి మానభంగం చేసిన వ్యక్తికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధిస్తూ మహిళా న్యాయమూర్తి  జి మైత్రేయి తీర్పు వెలివరీంచారు.

కేసు పూర్వపరాలు….
తేదీ 20.05.2017 ఆదిలాబాద్ గ్రామీణ మండలం బంగారిగూడ కు చెందిన గృహిణి (19)  ఉదయం 9 గంటలకు షాపింగ్ కోసం ఆటోలో ఆదిలాబాద్ మార్కెట్ కు వెల్లుటకై  షేక్ వసీం(24) తండ్రి షేక్ బాబు కిన్వట్ కు చెందిన వ్యక్తి, ప్రస్తుతం బంగారిగూడ లో ఉంటూ ఆటో నడుపు కుంటున్నాడు, బాధితురాలు నిందితుని ఆటోలో వెళ్లగా, వినాయక్ చౌక్ వచ్చిన తర్వాత ఆమెకు చాక్లెట్లు ఇచ్చాడు. అది తిన్నాక కొద్దిసేపటికి కళ్లు తిరిగి స్పృహ కోల్పోయినది. మరుసటి రోజు సాయంత్రం స్పృహలోకి రాగా కొత్త ప్రాంతంలో ఉన్నట్లు అనిపించింది.  అక్కడ ఉన్న మహిళలను అడగగా అది కిన్వాట్ లో గల వసీం ఇల్లు అని తెలిసినది. వెంటనే వసీం వచ్చి తనను చంపుతానని బెదిరించి బలవంతంగా మానభంగం చేసి నాడు అని తెలిపినారు. 20.05.2017 నుండి 06.06.2017 వరకు ఇంట్లో బంధించి ప్రతిరోజు మానభంగం చేసినాడు.

బాధితురాలు కనపడక ఆమె భర్త ఫిర్యాదు మేరకు తేది 21.05.2017 న అప్పటి  ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ టి తిరుపతి కేసు నమోదు చేసి cr no 69/2017  మహిళా మిస్సింగ్ కేసులో కేసు నమోదు చేసి దర్యాప్తు లో భాగంగా 06.06.2017 కిన్వట్ లో ఉన్న విషయం తెలుసుకుని బాధితురాలిని, నేరస్తుడిని తీసుకొచ్చి బాధితురాలి స్టేట్ మెంట్ రాసుకొని sec 366,376(2)( n),344,506 IPC కింద నమోదు చేశారు. అప్పటి ఆదిలాబాద్ రూరల్ సిఐ కే పురుషోత్తం సాక్షులను సేకరించి నేరస్తుడిని అరెస్టు చేసి దర్యాప్తు తుది నివేదికను కోర్టు యందు సమర్పించారు.

ప్రత్యేక పిపి ఎం రమణారెడ్డి ఇట్టి కేసులో 15 మంది సాక్షులను సిడివో జమీర్, అనిల్ ల సహకారంతో విచారించి నేరము రుజువు చేయగా సోమవారం రొజు మహిళా కోర్టు న్యాయమూర్తి శ్రీమతి జి మైత్రేయి, నేరస్తుడు షేక్ వసీం కు sec 376(2)(n) IPC కింద 10 సం” లు కఠిన కారాగార శిక్ష, రూ.5000/- జరిమానా కట్టని పక్షంలో ఒక సంవత్సరం జైలు శిక్ష, sec 366 IPC కింద 5 సం”లు శిక్ష, రూ 3000/- జరిమానా కట్టని పక్షంలో ఒక సంవత్సరం జైలు శిక్ష, సెక్ 344 IPC కింద 1 సం” జైలు శిక్ష ,రూ 500/- జరిమానా, sec 506 IPC కింద 6 నెలల జైలు శిక్ష, రూ 500/- జరిమానా విధిస్తూ, రూ 9000/- మొత్తం జరిమానా ఆగు తీర్పు వెలువరించారు.
రూ.50,000/-  బాధితురాలికి నష్టపరిహారం అందించాలని న్యాయ సేవా అధికార సంస్థ వారిని ఆదేశించారు.
కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేసిన పి పి రమణ రెడ్డి, అప్పటి రూరల్ సిఐ పి పురుషోత్తం చారి, ఎస్ ఐ పి తిరుపతి ఏ హరిబాబు, కోర్టు డ్యూటీ ఆఫీసర్ జమీర్ అనిల్ లను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించారు. అదేవిధంగా  కోర్టు లైజన్ ఆఫీసర్ గంగా సింగ్, సి డి వో లు జమీర్ అనిల్ లను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి