◆ఎంపీ సోయం-జిల్లా అధ్యక్షుడు పాయల్ మధ్య తీవ్ర విబేధాలు
◆అర్ధరాత్రి సోయం తో వాగ్విదానికి ప్రయత్నించిన పాయల్ కొడుకు శరత్,అనుచరుడు ప్రవీణ్ రెడ్డి
◆సోషల్ మీడియా లో లీక్ ఐన ఆడియో కాల్ రికార్డ్ వైరల్ తో బిజెపి కార్యకర్తల్లో అయోమయం
రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్:
ఇచ్చోడ మండలంలోని బాబుల్ డోర్ ప్రాంతములో ఉన్న నాల్గు కుటుంబాలకు చెందిన అసైన్డ్ భూమి కొనుగోలు విషయం వివాదాస్పదమై భూ రగడకు దారితీసింది. అది కాస్త బీజేపీ పార్టీలో రెండు వర్గాలుగా చిలిపోయి కేసులు దాక వెళ్ళిపోయింది. వివరాల్లోకి వెళితే గత ఏడాది సెప్టెంబర్ మాసములో బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తన కుమారుడు శరత్ మరియు బంధువుల పేరు మీద ఇచ్చోడ కు చెందిన బిజెపి నాయకుని మధ్యవర్తిత్వముతో అసైన్డ్ భూమి కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుని భూ యజమానులకు డబ్బులు ఇవ్వకుండా,చెల్లని చెక్కులు ఇవ్వడమే కాకుండా భూ యజమానులను మానసికంగా భయ బ్రాంతులకు గురి చేశారని బాధితుల వాదన.
ఈ విషయమై ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఈ భూమి కొనుగోలు విషయమై సంబంధం కలిగిన నాయకుల పై ఆగ్రహం వ్యక్తం చేసి గుర్రుగా ఉన్నారు. ఈ పంచాయతీ కాస్త ఎంపీ దగ్గరకు చేరడముతో మంగళవారం రాత్రి ఇదే విషయమై ఎంపీ సమావేశమయ్యాడాని తెలుసుకుని అర్ధ రాత్రి ఒంటి గంట సమయములో పాయల్ కుమారుడు శరత్ మరియు ముఖ్య అనుచరుడు జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి ఎంపీ తో వాగ్విదానికి ప్రయత్నించి ఎంపీ గన్ మెన్లను పక్కకు తోస్తూ వారి విధులకు ఆటంకం కలిగిస్తూ నానా రచ్చ చేయడముతో గన్ మెన్ల పిర్యాదు మేరకు ఇద్దరి పైన మావల పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేస్ నమోదు చేశారు కానీ అధిష్టానం కల్పించుకోవడముతో శరత్ పేరును తొలగించినట్టుగా బోగొట్టా.
పాయల్ శరత్ పైన కూడా కేస్ నమోదు చేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేయడం చూస్తుంటే ఎంపీ సోయం బాపురావు ఈ కేస్ విషయములో చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇచ్చోడకు చెందిన ఒక బిజెపి నాయకుడు పాయల్ శంకర్ తో మాట్లాడిన కాల్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ కావాడముతో బిజెపి కార్యకర్తలు పార్టిలో ఎం జరుగుతుందోనని అయోమయానికి గురి అవుతున్నారు.
ఈ విషయమై బిజెపి రాష్ట్ర అధిష్టానం ఎంపీ సోయం బాపురావు వైపు నిలుస్తుందా?లేదా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ వైపు నిలుస్తుందా అని కార్యకర్తలు ఎదిరిచూస్తున్నారు.
ఆదిలాబాద్ బిజెపి లో ఏ క్షణం ఎం జరుగుతుందోనని,ఎవరి రాజకీయ భవిష్యత్తుకు ఆటంకంగా మారుతుందోనని చర్చించుకుంటున్నారు. ఏ పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి మరి.
Recent Comments