రేపు బోథ్ లో మెగా వైద్య శిబిరం
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అదిలాబాద్ వారు బోథ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు గురువారం రోజు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డిఎంహెచ్ఓ డా.నరేందర్ రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరంలో ప్రత్యేక వైద్య నిపుణులు అయిన స్త్రీ వైద్య నిపుణులు, పిల్లల , ఎముకలు, దంతాలు, కళ్ళు, ముక్కు చెవి గొంతు, చర్మ , శస్త్రచికిత్స, జనరల్ మెడిసిన్ మొదలగు ప్రత్యేక వైద్య నిపుణులచే ఉచిత చికిత్సలు అందించబడతాయని తెలిపారు.
గర్భిణీలకు స్కానింగ్,రక్త పరీక్షలు
మందులు అందించబడుతాయని,
ఆయుష్మాన్ భారత్ కార్డు రిజిస్ట్రేషన్ చేసి డిజిటల్ ఐడి కార్డు (ఆరోగ్యశ్రీ లాంటిది)ఇవ్వడం, పోషకాహార సంబంధ సలహాలు అందించడం, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించడం, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని రకాల సదుపాయాలు ఒకే చోట అందించడం జరుగుతుందని, ఇట్టి సదావకాశాన్ని బోథ్, బజార్ హత్నూరు, నెరడిగొండ, ఇచ్చోడ, తదితర ప్రాంతాల్లోని ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని, వచ్చేటప్పుడు తప్పకుండా ఆధార్ కార్డు గానీ డ్రైవింగ్ లైసెన్స్ గాని ఓటర్ ఐడి కార్డులు, ఫోన్ నెంబర్లు తీసుకొని రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ క్యాంపు ఉదయం 9:00 గంటల నుండి ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు, సేవలు పొందాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Recent Comments