— మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా పండించిన శనగ పంట కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మార్కెట్ యార్డులో సదుపాయాలు, రక్షణ పర్యవేక్షణ లోపించిందని శనగ పంట కొనుగోలుకు సంబంధించిన గన్ని బ్యాగులు లేకపోవడం ఐదు రోజుల నుంచి కొనుగోలు నిర్వహించ లేకపోవడాన్ని నిరసిస్తూ రైతులతో కలిసి స్థానిక బోథ్ పట్టణ ముఖ ద్వారం వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో ఢిల్లీలో పై ధర్నా చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో వెనకబడ్డ ఆదిలాబాద్ జిల్లాలో రైతుల దగ్గర నుండి శనగ పంట కొనుగోలు చేయలేని దౌర్భాగ్య స్థితి ఉండి తెలంగాణ రైతులను ఆత్మహత్యల సుడిలోకి నెట్టీవేస్తున్నారని నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ శనగ పంట కొనుగోలు విషయంలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు.

శనగ పంటను ఆరబెట్టడానికి, ఆరబెట్టిన పంటను మార్కెట్కు తీసుకురావడానికి రైతులు అనేక అవస్థలు పడుతుంటే తీరా మార్కెట్ కు తీసుకు వచ్చిన తర్వాత సదుపాయాలు లేక, పంటకు రక్షణ లేక రైతులు తమ పంటను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారని తక్షణమే స్థానిక మార్కెట్ కమిటీ, జిల్లా అధికార యంత్రాంగం శనగల కొనుగోలు విషయంలో చిత్తశుద్ధిని చూపాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన చివరి గింజ వరకురాష్ట్ర ప్రభుత్వం కొనాలని లేకుంటే మరొకసారి ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని, రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ముందుంటుందని రైతులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బోథ్ మండల అధ్యక్షుడు కుర్మే మహేందర్, పట్టణ అధ్యక్షులు సల్ల రవి వివిధ గ్రామాల రైతులు, యువకులు ఈ రాస్తారోకో కు మద్దతుగా నినాదాలు చేశారు


Recent Comments