తల్లిదండ్రులు గర్వపడేలా ఉన్నత స్థానాన్ని దక్కించుకోవాలి – బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
కఠోరమైన శ్రమతోనే ఉన్నత ఉద్యోగాలను సాధించవచ్చు – జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ నియామకాలకు ఉచిత శిక్షణ శిబిరాన్ని ఇచ్చోడ మండల కేంద్రంలోని వివేకానంద జూనియర్ & డిగ్రీ కళాశాలలో ప్రముఖ ఫ్యాకల్టీ వారిచే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మరియు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి లు పాల్గొని శిక్షణ శిబిరానికి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మరియు ఉట్నూర్ ఎఎస్పీ హర్షవర్ధన్, ఆదిలాబాద్ డిఎస్పీ వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల శ్రమను వృధా కానీయకుండా కష్టపడి చదివి ఉన్నత స్థానాలను,లక్ష్యాలను అధిరోహించాలని సూచించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిరుద్యోగ యువతి యువకులు పోలీసులు ఏర్పటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు..
జిల్లా పోలీసులు యువకులకు సువర్ణావకాశం కల్పించారు కనుక యువత సత్ప్రవర్తన తో ఉంటూ ఏర్పాటు చేసిన శిబిరంలోని ఫ్యాకల్టీ వారు కల్పించే శిక్షణ పై శ్రద్ధగా దృష్టి సారిస్తు పోలీస్ కొలువులో ఉద్యోగాన్ని సాధించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ ఉచిత శిక్షణలో బోథ్, బజార్హత్నూర్, నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్ మండలాలకు సంబంధించిన 123 విద్యార్థిని, విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ శిక్షణ శిబిరం ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒక గంట భోజన విరామం ఉంటుందని తెలిపారు. శిక్షణ కు విచ్చేసిన ప్రతి ఒక్కరికి మధ్యాహ్న భోజనం మరియు శిక్షణకు కావలసిన స్టడీ మెటీరియల్స్ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. శిక్షణకు ఎంతగానో ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరియు శిక్షణకు అనువైన స్థలాన్ని అందించిన ఇచ్చోడ మండల కేంద్రంలోని వివేకానంద జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఉచిత శిక్షణకు ఎక్కువ మొత్తంలో యువతిలు మొగ్గుచూపి శిక్షణ శిబిరానికి వచ్చారని ఎస్పీ అన్నారు..
ఇంత చక్కటి పోలీస్ శిక్షణ శిబిరాన్ని ఏర్పటు చేసిన తీరును బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎమ్. నైలు ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆరు మండలాల ఎస్సై లు బోథ్ ఎస్ఐ కేంద్రే రవీందర్, బజార్హత్నూర్ ఎస్ఐ ముజాహిత్, ఇచ్చోడ ఎస్ఐ ఉదయ్ కుమార్, శ్రీకాంత్, గుడిహత్నూర్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్, సిరికొండ ఎస్ఐ పి. నరేష్, నెరడిగొండ ఎస్ఐ మహేందర్, మరియు ఫ్యాకల్టీలు రమణ గౌడ్, అల్లం సాయి కృష్ణ, పురుషోత్తం రెడ్డి, వివేకానంద కళాశాల ప్రిన్సిపాల్ నిఖిని వర్మ, యువకులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments