📰 ప్రింట్ రేట్ మార్పింగ్ చేసి అధిక ధరలకు నూనె అమ్ముతున్నా ఇచ్చోడా కి చెందిన సిల్వర్ కిరాణా, గోల్డెన్ కిరాణా షాప్ యజమానుల పై కేసులు నమోదు…
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : కరోనా కష్టకాలంలో ప్రజల బతుకులు ముందే ఆగమావుతావుంటే, రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దాన్ని సాకుగా చూపి కిరాణా షాప్ యజమానులు సామాన్య ప్రజలను నిలువునా దోపిడీ కి గురించి చేస్తున్నారు.
అసలు ధర కనపడకుండా స్టిక్కర్లు పెట్టి అధిక ధరలకు నిత్యావసర సరుకులను విక్రయిస్తున్న సంఘటన ఇచ్చోడా లో అధికారుల తనిఖీల్లో బయటపడింది.

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రము లో పలు కిరాణా షాపులలో లీగల్ మేటాలజి ఇన్స్పెక్టర్ జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా ఇచ్చోడా కు చెందిన గోల్డెన్ కిరాణా మరియు సిల్వర్ కిరాణా షాప్ యజమానులు ప్రింట్ రేట్ కి బదులు స్టిక్కర్లు పెట్టి అధిక ధరలకు నూనె విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
అసలు ధర కు బదులు అధిక ధర కు అమ్ముతున్నా 7 షాపుల యజమానుల, ఆయిల్ కంపెనీల పై కేసులు నమోదు చేసి, లక్ష రూపాయల పెనాల్టీ విధించారు.
ఈ తనిఖీ కార్యక్రమం లో ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ప్రభాకర్,ఇచ్చోడ డిప్యూటీ తహసీల్దార్ రామారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


Recent Comments