— జిల్లాలో నిరంతరాయంగా కొనసాగుతున్న సిసిఎస్,స్పెషల్ బ్రాంచ్ పోలీసుల దాడులు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అనిచివేయాలనే జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా సిసిఎస్,స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పని చేస్తున్నారు. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో రాయితీ బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నట్లు సమాచారం సేకరించిన సీసీఎస్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి మరియు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి సంయుక్తంగా సిబ్బందితో కలిసి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుపెల్లి ఏరియా నందు గల ఒక దుకాణం లో తనిఖీ చేయగా, క్రాంతి నగర్ కు చెందిన నిందితుడు గూగుల్ వార్ రాజు దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 50 క్వింటాళ్ల రాయితీ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. స్వాధీన పరుచుకున్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారికి దర్యాప్తు కోసం అప్పగించారు. ఈ దాడుల్లో సిసిఎస్ ఎస్సై సి అశోక్, కానిస్టేబుల్ రమేష్, హనుమంతరావు,తదితరులు పాల్గొన్నారు.
Recent Comments