🔴 వారు అ బోర్డు పీకేసి పనులు ప్రారంభీస్తారు…..
🔴 అధికారులకె సవాల్ విసురుతున్న ఇచ్చోడా రియాలిస్టేట్ వ్యాపారాలు….
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : జిల్లా స్థాయి ఉన్నంతధికారుల ఆదేశాల మేరకు డిఎల్పివో మరియు గ్రామపంచాయతీ అధికారులు ఇచ్చోడా లో వెలిసిన అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనొద్దని అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్లాట్లు చేసిన సరిహద్దు రాళ్లను సైతం ట్రాక్టర్ల తో చదును చేశారు.

అధికారుల చర్యలకు ఏ మాత్రం భయపడని సదరు వెంచర్ నిర్వాహకులు మరుసటి రోజే హెచ్చరిక బోర్డులు పీకేసి దర్జాగా ప్లాట్లు అమ్మకం మొదలు పెట్టేశారు. కొనొగులుదారులకు నమ్మకం కలగాడానికి మొరం రోడ్డులు వేస్తున్నారు. అదే విధంగా ప్లాట్ల లో మొరం నింపి తాము ఎవరికీ బయపడమని సందేశం ఇస్తున్నారు.
డిఎల్పివో ధర్మారాణి స్వయం గా వెంచర్ల పై చర్యలు తీసుకున్నరూ. హెచ్చరిక బోర్డులు తొలగిస్తే, ఏజెన్సీ చట్టం 1/70 ప్రకారం ఇల్లీగల్ వెంచర్ భూముల ను ఎల్టీఆర్ కింద భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు కూడాను. సదరు వెంచర్ నిర్వాహకులు అ చర్యలను మాములు విషయం గా తీసుకుని మళ్ళీ ఇల్లీగల్ ప్లాట్ల దందా షురూ చేశారు.
అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టినప్పుడు ప్రజలు కొంత మేర అవహగాన తెచ్చుకున్నా అంత చూసుకున్నాం, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అని కొనుగోలుదారులను కన్వీన్స్ చేసి వ్యాపారం షురూ చేశారు.
Recent Comments