రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పట్టణం కేంద్రం లో రోజురోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. నెలల వ్యధిలోనే మరో దొంగతనం జరిగింది.
ఇచ్చోడ లో ప్రధాన రహదారి పక్కన ఉన్న మహేష్ ఎలక్ట్రికల్స్ అనే దుకాణం లో మంగళవారం రోజు రాత్రి దొంగతనం జరిగింది. ఇచ్చోడ ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పురోహిత్ భరత్ కుమార్ అనే వ్యక్తి తన దుకాణం ను మంగళవారం రోజు రాత్రి 9 గంటలకు మూసి వేసి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే మరుసటి రోజు ఉదయం దుకాణం తెరవడానికి వెళ్లగా దుకాణం శెట్టర్ తాళం ఒక వైపు తొలగించి, షట్టర్ పైకి చేసి ఉండడం చూసి అనుమానం తో లోపలి వెళ్లి చూడగా హౌస్ వైరింగ్ కోసం ఉపయోగించే వైర్ల బిండల్స్ దొంగతనం జరిగినట్లు గ్రహించి పోలీసుల కు సమాచారం అందించాడు. దొంగతనం జరిగిన వస్తువుల విలువ సుమారు రూ. 85 వేల వరకు ఉంటుందని ఫిర్యాదు లో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Recent Comments