రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ (క్రైం) : ఇచ్చోడ మండలం లోని నర్సాపూర్ గ్రామం లో ఓ యువకుడు చేసిన అప్పులు ఎలా తీర్చాలో బాధపడుతూ, అప్పుల భాద తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఇచ్చోడ ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నర్సాపూర్ గ్రామానికి చెందిన ముండే కిషన్ అనే వ్యక్తికీ ముగ్గురు కొడుకులు ఉన్నారు. మూడో కుమారుడు ముండే కైలాష్ ఇచ్చోడ మండల కేంద్రం లో రెండు సంవత్సరాలు గా ఓ వెల్డింగ్ షాప్ ను నిర్వహిస్తున్నాడు. వెల్డింగ్ షాప్ లో నష్టాలు రావడం తో ఇంట్లో రోజు చేసిన అప్పుల గురించి చెబుతూ బాధపడేవాడు. శనివారం రోజు ముండే కైలాష్ తన తండ్రితో కలిసి శనగ పంట కుప్పల కావలికి వెళ్లారు. రెండు కుప్పల పై ఒక్కొక్కరు పడుకున్నారు. అయితే రాత్రి పందులు రావడం తో ముండే కిషన్ తను కొడుకును పిలిచాడు. అక్కడి నుండి ఎలాంటి స్పందన రాలేదు. దింతో దగ్గర వెళ్లి చూడగా ముండే కైలాష్ (19) నోటి పురుగు ల మందు వాసనా నూరుగు రావడం చూసి గట్టిగ కేకలు వేశాడు. పక్క పొలాల్లో కాపలా ఉన్న వారు వచ్చి అప్పటికే మృతి చెందిన యువకుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Crime : అప్పుల భాదతో యువకుడి ఆత్మహత్య
Thank you for reading this post, don't forget to subscribe!


Recent Comments