🔴 5 కిలో గంజాయి స్వాధీనం….
రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : నిషేధిత గంజాయి పై రాష్ట్రప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది.
తాజాగా ఇచ్చోడ మండలం లో గంజాయి అక్రమంగా తరలిస్తున్నా వారిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇచ్చోడ సిఐ రమేష్ బాబు పాత్రికేయుల సమావేశం లో వెల్లడించిన వివరాల ప్రకారం…
ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామిడి గ్రామం పరిసర ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా,సరఫరా చేస్తూన్నారనే విశ్వసనియా సమాచారం రావడం తో ఎస్సై ఉదయ్ కుమార్ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి అనుమానాస్పదంగా సిరిచెల్మ నుంచి ఇచ్చోడ వైపు వెళుతున్న TS01EL6174 నెంబర్ గల ద్వీచక్ర వాహనం ను తనిఖీ చేయగా, వాహనం పై గంజాయి ఉండటంతో, తనిఖీ చేస్తున్నా క్రమంలో పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు.

ఈ క్రమంలో ఒకర్ని పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. మరొకరు పారిపోయినట్లు తెలిపారు. పట్టుబడిన వ్యక్తి బజార్ హత్నూర్ మండలం ధరంపూరి గ్రామానికి చెందిన అర్క ఈశ్వర్ గా గుర్తించారు. మరియు పారిపోయిన అర్క హరీష్ కోసం అన్వేషణ కొనసాగుతున్నట్లు తెలిపారు. పట్టుబడిన నిందితుడి వద్ద నుండి 5 కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 50000 వేలు వరకు ఉంటుందని తెలిపారు. నిందితుడ్ని పోలీసు విచారణ లో భాగంగా గంజాయి ఎక్కడి నుండి సరఫరా చేస్తున్నారని విచారించగా సిరికొండ మండలం జెండగూడ గ్రామం నుంచి అర్క హరీష్ కి సంబంధించిన వారి నుండి తీసుక రావటం జరిగింది అని చెప్పాడు. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కొరకు గంజాయి అమ్మి సులభంగా డబ్బు సంపాదించి జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నామని నిందితుడు పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. గంజాయిని హైదరాబాద్ లో అమ్మటం ద్వారా భారీ మొత్తం లో డబ్బులు సంపాదించవచ్చు అని ఉద్దేశ్యంతో హైదరాబాద్ కి తరలించడానికి వెళ్తుండగా పోలీస్ లకు పట్టుబడటం జరిగింది. నిందితుడు గత కొంత కాలంగా గంజాయ్ అమ్మి డబ్బు సంపాదిస్తూ తాను కూడా గంజాయ్ తాగుతున్నాన్నట్లు ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. ఇచ్చోడ డిప్యూటీ తహశీల్దార్ రామారావు పంచుల సమక్షంలో పంచనామ నిర్వహించారు.
♦️ *ప్రజలకు ఇచ్చోడ సిఐ రమేష్ బాబు విజ్ఞప్తి*
*యువత ఎక్కువగా గంజాయికి బానిస అయి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ మరియు నేరాలకు పాల్పడుతున్నారని ఇచ్చోడ సిఐ రమేష్ బాబు తెలిపారు . తల్లిదండ్రులు తమ తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారి కదలికలను మరియు వారి ప్రవర్తనను నిశితంగా గమనించాలని కోరారు. ముఖ్యంగా వారు ఎవరితో స్నేహం చేస్తూ ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారో వారందరి పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలి. గంజాయి గురించి ఎలాంటి సమాచారం ఉన్న డయల్ 100 కి గాని,నేరుగా మాకు గాని సమాచారం ఇచ్చి యువతను చెడు మార్గం వైపు వెళ్లకుండా మాకు సహకరించగలరని అన్నారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడుతాయని తెలిపారు.
గంజాయి అమ్మిన లేదా కొన్న లేదా సేవించిన వారి పై చట్టరీత్య కఠినచర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments