రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : సీసీఐ సాధన కమిటీ ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన ఐలవ్ సీసీఐ సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే జోగురామన్న సెల్ఫీ దిగి సందడి చేశారు. టెక్నాలజీని వాడుతూ కూడా సోషల్ మీడియా ద్వారా ఉద్యమించవచ్చని అనేక సందర్భాల్లో సోషల్ మీడియా పలు విషయాల్లో నిరసనలు కానీ ఉద్యమాలలో విజయాలు సొంతం చేసుకుందని ఎమ్మెల్యే జోగురామన్న గుర్తు చేశారు. సీసీఐ పునరుద్దరణ అంశాన్ని నేడు సోషల్ మీడియా వేదికగా బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కలిగేలా ఉద్యమించడం జరుగుతుందని తెలిపారు.
ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌక్ లో మంగళవారం ఏర్పాటు చేసిన సీసీఐ సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే జోగురామన్న పాల్గొని మొదట సెల్ఫీ దిగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఫోటో దిగుతూ మోడీకి చేరే వరకు ఉద్యమించాలని కోరారు. బీజేపీ ప్రభుత్వానికి పునరుద్దరణ అంశంపై కనువిప్పు కలిగేలా ఈ సోషల్ మీడియా సెల్ఫీ పాయింట్ ద్వారా ప్రతి ఒక్కరూ సెల్ఫీ దిగుతూ,ఫేస్ బుక్,ట్విట్టర్,ఇంస్టాగ్రామ్ ఇలా అనేక మధ్యమాల్లో ఈ ఫోటోలను వైరల్ చేస్తూ సీసీఐ సాధన కమిటీ ద్వారా ఉద్యమించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న,సీసీఐ సాధన కమిటీ కో-కన్వీనర్ విజ్జగిరి నారాయణ, కొండా రమేష్,మునిగేలా నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments