రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
టమాటా లోడ్ తో వెళుతున్నా ఐచర్ వాహనం ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర అదుపుతప్పి నడిరోడ్డు పై బోల్తా కొట్టింది. డ్రైవర్ మితిమిరిన వేగం తో వాహనం నడపడం తో రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజి పై దూసుకెళ్లిన వాహనం ఆ తర్వాత ముందు వెళ్తున్న ఎర్టిగా వాహనాన్ని ఢీ కొట్టింది. డ్రైవర్ తాగి వాహనం నడపడం తో సడ్డెన్ గా బ్రేక్ వేయడం తో నే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. స్వల్పంగా గాయపడిన డ్రైవర్ ను 108 అంబులెన్సు లో చికిత్స నిమ్మిత్తం తరలించారు.
Recent Comments