రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : మండలంలోని హీరపూర్ గ్రామములో నూతన రోడ్డు నిర్మాణానికి హాజరైన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ను గ్రామస్థులు గురువారం రోజు బాజాభజంత్రీలతో ఘన స్వాగతం పలికారు. సి.డి.పి కింద మంజూరైన 200 మీటర్ల సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం గ్రామములో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్ జాధవ్ మీనాబాయి, బాధి గూడ సర్పంచ్ అమృత్ రావు, దాబా సర్పంచ్ రామారావు, దాబా ఉప సర్పంచ్ రామేశ్వర్, గోవింద్ నాయక్, గులాబ్ సింగ్ తో పాటు 150 మంది బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు సమక్షంలో బి.జె.పి,కాంగ్రెస్ నుండి తెరాస పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి ఖండువలు కప్పి పార్టీ లోకి సహదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామములో ఎలాంటి భేదాభిప్రాయాలకు తావు ఇవ్వకుండా అందరూ ఒక్కతాటిపై చేరి రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి పాటు పడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమములో మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి, మాజీ ఎంపీపీ దుక్రే సుభాష్ పటేల్, ఆత్మ ఛైర్మెన్ నరాల రవీందర్, రాథోడ్ ప్రకాష్, ఎంపీటీసీ, నాగవేణి వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ ముస్తఫా, మరియు సర్పంచులు మాడవి భీమ్ రావు, రాజు,దాసరి భాస్కర్, రాథోడ్ ప్రవీణ్, పురుషోత్తం రెడ్డి, గాయకాంబ్లీ గణేష్, అరుగుల గణేష్, అజీమ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తెరాసతోనే అసలైన అభివృద్ధి : బోథ్ఎమ్మెల్యే
Thank you for reading this post, don't forget to subscribe!
Previous article
Next article
Recent Comments