Friday, November 22, 2024

నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు దుకాణం ముందు ప్రదర్శించాలి

  • ఈ నెల 23 న పల్స్ పోలియో
    కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యలు… మహారాష్ట్ర సరిహద్దు నుండి వచ్చేవారికి స్క్రీనింగ్ తప్పనిసరి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ కలెక్టరేట్ : కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండేలా ప్రచారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లాకలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యలు, పల్స్ పోలియో పై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు ప్రజలకుండా ముందస్తు కార్యక్రమాలు చేపట్టాలని, వైద్యం, మున్సిపల్, పంచాయితీ, పోలీస్, తదితర శాఖల సమన్వయంతో కోవిడ్ నివారణచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రజలు సమూహాలుగా ఉండకుండా కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. షాపింగ్ మాల్స్, రైతు బాజార్, సినిమా హాళ్లు, దుకాణాలు, వీధి వ్యాపారా కూడళ్లు, పండుగల వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండేవిధంగా, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులను శానిటైడ్ చేసుకోవడం జరగాలని అన్నారు. మున్సిపల్, పంచాయితీ అధికారులు వారి పరిధిలోని దుకాణాలలో నో మాస్క్ నో ఎంట్రీ అనే విధంగా ప్రతి దుకాణం ముందు బోర్డులను ప్రదర్శించాలని అన్నారు. కోవిడ్ వ్యాప్తి సున్నితమైందని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇప్పటికీ పోలీస్ యంత్రాంగం ప్రజలకు కోవిడ్ పై అవగాహన కల్పించి విస్తృత ప్రచారం నిర్వహించారని, ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు పాటించని వారి నుండి అపరాధరుసుము వసూలు చేస్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి వచ్చే వారిని రేపటి (మంగళవారం) నుండి వైద్య సిబ్బంది ద్వారా స్క్రీనింగ్ నిర్వహించాలని వైద్య అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో అధికారులు, సిబ్బంది,కార్యాలయాలకు వచ్చే వారుకూడా కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కోవిడ్ వ్యాప్తినిరోధక చర్యల్లో భాగంగా ప్రజలకు కోవిడ్ టెస్ట్ లు నిర్వహించాలని, రిమ్స్ లో ఆక్సిజన్, వెంటిలేటర్ టెడ్ లను సిద్ధం చేయాలనీ, ఆక్సిజన్సిలెండర్ లను అందుబాటులో ఉంచాలని అన్నారు. పట్టణాలు, బస్ స్టాండ్ లు, గ్రామాల్లో, వివిధ ముఖ్యకూడళ్లలో పబ్లిక్ అడ్రెస్స్ సిస్టమ్ద్వారా కోవిడ్ నిబంధనలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. కోవిడ్ టెస్టింగ్, వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్నిరంతరం కొనసాగించాలని వైద్య అధికారులకు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, జిల్లాలో మొదటి డోస్ 98 శాతం, రెండు డోస్ 80 శాతం మందికి పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. 15-17 వయసు గల పిల్లలకు ఇప్పటివరకు 45శాతం టీకా పంపిణీ జరిగిందని తెలిపారు. బూస్టర్ డోస్ ప్రంట్ లైన్ వర్కర్లకు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు, 60 సంవత్సరాలు వయసుపైబడిన వారికి అందించడం జరుగుతుందని వివరించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 9 నెలల అనంతరం లేదా, 36 వారాల అనంతరం బూస్టర్ డోస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పల్స్ పోలియో కార్యక్రమంపై కలెక్టర్ సమీక్షిస్తూ, ఈ నెల 23 న బూత్ లలో, 24, 25 తేదీలలో ఇంటింటికీపోలియో పంపిణీ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 78,260 మంది పిల్లలకు పల్స్ పోలియోఅందించాలని లక్ష్యం అని తెలిపారు. అందుకు 730 బూత్ లను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 8 వేల డోసుల పోలియో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో వందశాతం పల్స్ పోలియో కార్యక్రమాన్నివిజయవంతం చేయాలనీ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అతుల్ మాట్లాడుతూ గత 22 సంవత్సరాల నుండి పల్స్ పోలియో జిల్లాగా ప్రకటించబడిందని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, పోలియో వ్యాక్సిన్ పిల్లలకు అందించాలనిసూచించారు. అనంతరం పల్స్ పోలియో కు సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి రాజేశ్వర్, అదనపు ఎస్పీలు శ్రీనివాస్ రావు, వినోద్ కుమార్, ఆర్డీఓ రాజేశ్వర్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాధన, జిల్లాఇమ్యునైజేషన్ అధికారి డా. శ్రీకాంత్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి