15 ఎకరాల భూమిని అన్యాయం గా ఇతరుల పేరిట పట్టా చేసేశారని ముగ్గరు రైతుల ఆగ్రహం….
బోథ్ లో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
న్యాయం జరిగేలా చూస్తామని ఎస్సై సముదాయించడంతో శాంతించిన బాధితులు

ఆదిలాబాద్ జిల్లా: రెవెన్యూశాఖ లో అవినీతి అందలం ఎక్కిందని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు పేర్కొన్నారు. రెవెన్యూ ప్రక్షాళన ను సైతం చేపట్టారు. అయిన అధికారుల్లో మార్పురావడం లేదు.
తాజా బోథ్ నియోజకవర్గ కేంద్రం
తహసీల్దార్ కార్యాలయం ఎదుట కౌఠ ( బి) గ్రామానికి చెందిన చాట్ల నర్సింగ్, నారాయణ, గంగూబాయి రైతులు తమ భూములను అన్యాయం గా , అక్రమంగా , దౌర్జన్యం గా 15 ఎకరాల భూమిని ఇతరులకు పట్టా చేసిచ్చినట్లు పేర్కొంటూ పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ భూములను తహసీల్దార్ డబ్బులు తీసుకొని దొంగ పట్టా చేసారని, మాకు న్యాయం చేయకపోతే మందు తాగి చనిపోతాం అని ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న బోథ్ ఎస్సై పి. రాజు ఎంత వారించినా గాని ఆందోళన చేస్తున్న రైతులు వినలేదు. మహిళ రైతు మందు తాగబోయింది… దీంతో ఎస్ ఐ మందు డబ్బా లాక్కొని న్యాయం జరిగేలా చూస్తామని సముదాయించడంతో ఆందోళన విరమించారూ.


Recent Comments