రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లోని గిరిజన గ్రామమైన కోసయి గ్రామంలోని గుట్ట మీది నుండి నీళ్లు నేరుగ నడి గ్రామంలోని ఇండ్ల మద్యలో నుండి ప్రవహిస్తుండడంతో గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి జడ్పి నిధుల నుండి 3లక్షలు , ఎంపిపి నిధుల నుండి 3లక్షలు మొత్తం 6లక్షల రూపాయలతో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి గ్రామస్తులకు ఆర్డర్ కాపీ అందజేశారు. ఎలక్షన్ కోడ్ ఉన్నందున కోడ్ ముగిసిన తర్వాత పనులు మొదలు చేస్తామని హామీ ఇచ్చి, అలాగే ఆదివాసీ గ్రమామైన ఇందిరా నగర్ గ్రామాన్ని సందర్శించి నీటి ఇబ్బందీ ఉందని గ్రామస్తులు తెలియజేయడంతో 1లక్ష రూపాయలతో బోర్ మంజూరు చేపించి ఆర్డర్ కాపీ అందజేసిన తలమడుగు జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి. ఎంపిపి కళ్యాణం లక్ష్మి రాజేశ్వర్, ఈ కార్యక్రమంలో కోసాయి సర్పంచ్ సుభాష్, వైస్ ఎంపిపి దివ్య మాధవ్, ఉమ్రి ఎంపీటీసీ హనుమంతు, సుంకిడి ఎంపీటీసీ వెంకట్ యాదవ్, ఝరి సర్పంచ్ రఘునాథ్, జయరామ్, లస్మన్న, దత్తు, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు..
Recent Comments