రిపబ్లిక్ హిందుస్థాన్ , గుడిహత్నూర్ : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గర్కం పెట్ గ్రామంలో జరిగిన దండారి ఉత్సవాల్లో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుస్సాడీ నృత్యాల ను తిలకించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామానికి 20 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజరు చేస్తానని హామీ ఇచ్చారు.

ముఖ్యంగా రోడ్డు సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దింతో గ్రామస్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. త్వరలో రోడ్డు పనులు మొదలు చేస్తానని హామీ ఇచ్చారు. బోథ్ నియోజకవర్గంలో రోడ్ల కోసం త్వరలో నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి , ఉప సర్పంచ్ మరియు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.
Recent Comments