రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నుర్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ మండలం బుర్కపల్లి లో పిడుగు పడి మృతిచెందిన వారి కుటుంబాలను ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పరామర్శించారు.
అక్టోబర్ 09.2021 శనివారం రోజున సోయాబీన్ పంట కోత కొస్తుండగా పిడుగు పడి బజార్ హత్నూర్ మండలంలోని బూర్కపల్లి గ్రామానికి చెందిన బనియా గరన్ సింగ్ మరియూ బనియా ఆశబాయ్ పిడుగు పాటుకు మృతి చెందిన విషయం తెలిసినదే.
ఎమ్మెల్యే వెంట మండల కన్వీనర్ కానిందే రాజారామ్, మండల మహిళ అధ్యక్షురాలు విద్యాసాగర్, స్థానిక సర్పంచ్ పెందుర్ చంద్రకళ, భాస్కర్ రెడ్డి, నర్సరెడ్డి, ప్రభు, నాయకులు మరియూ అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Recent Comments