♦️ఇచ్చోడలో వరుస చోరీలు..!
♦️భయాందోళనలో ప్రజలు..!
♦️ ప్రజలు అప్రమత్తంగా లేకపోతే నష్టమే..!
రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడా : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో వరుసగా జరుగుతున్న దొంగతనాల వలన ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దొంగలు భయం లేకుండా మరో దొంగతనానికి ప్రయత్నించడం మండల కేంద్రంలో హాట్ టాపిక్ గా మారింది. మండల కేంద్రంలో బుధవారం ఒక నగల దుకాణం లో చోరీ దొంగతనం జరిగిన సంఘటన మరువక ముందే మరో చోరీ ప్రయత్నం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున టీచర్స్ కాలనీలో దుండగులు చోరీ యత్నం చేయడం, ప్రజలు అప్రమత్తం అవ్వడంతో విఫలమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..టీచర్స్ కాలనీలో ఒక ఇంట్లో దుండగులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించడం కోసం యత్నించగా ఆ శబ్దాలు విని ఇంటి యజమాని లేచి చుట్టుపక్క ప్రజలను అప్రమత్తం చేయడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
టీచర్స్ కాలనీ లోని చర్చ్ తలుపులు కూడా బద్దలు కొట్టినట్టు సమాచారం. ఈ వరుస దొంగతనాల వలన మండల కేంద్రంలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వరుస దొంగతనాలతో దొంగలు రెచ్చిపోతున్న అధికారులు ఎం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Recent Comments