యాపల్ గూడ అంగన్వాడి కేంద్రాన్ని ఇచ్చోడా ఎంపిపి నిమ్మల ప్రితం రెడ్డి సందర్శించారు. సూపర్ వైజర్ ఉమారాణి , ఎంపీటీసీ దేవురావు, సర్పంచ్ లావణ్య తో కలిసి కేంద్రంలో కల్పిస్తున్న సదుపాయాల అంగన్వాడీ కార్యకర్త కె ఆనందను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గర్భిణీ, బాలింతలు, 3-6 సం,, పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది. అంగన్వాడి కేంద్రం మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో ఉన్న స్టాక్ ను పరిశీలించారు. గర్భిణీ,బాలింతలు ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రం లో భోజనం చేయాలి,సేవలు వినియోగించుకోవాలి అన్ని చెప్పడం చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్ సుమ , మహిళలు పాల్గొన్నారు.



Recent Comments