సంఘం సభ్యుల డిమాండ్….
రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని
రూ వెయ్యి కోట్ల బడ్జెట్ తో వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు సంఘం సభ్యులు ఇచ్చోడా తహశీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు తోట శివన్న మాట్లాడుతూ మున్నూరు కాపులలో 75 శాతం మంది వ్యవసాయం పైనే ఆధారడి జీవిస్తున్నారు. సంక్షేమ పథకాలు, విద్య రుణాలకు నోచుకోలేకపోతున్నామని అన్నారు.
రైతులు వ్యవసాయం వదులుకోక ఇతర వృత్తుల వైపు మళ్లాడానికి ఆర్థిక స్తోమత లేక, బతుకు భారమై, కడు బాధలతో పిల్లల చదువులు కొనసాగించడానికి ఇక్కట్లకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం స్థానిక తహసీల్ధార్ అతిఖోద్దీన్ కో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆర్డినెటర్లు నరాల రమణయ్య, బలగం రవి కుమార్, ఇచ్చోడ, కోకస్ మన్నూర్, గెరిజం, మాదాపూర్, తలమద్రి కామగిరి, బొరిగామ, ఆడే గామ కే, సిరిచేల్మ గ్రామాల అధ్యక్షులు ఐదా రాజేశ్వర్, దాసరి భాస్కర్, నరాల వసంత్ కుమార్, కొత్తూరి గంగయ్య, సందా రమణ, సాయిని సంతోష్, లక్కము రాజేశ్వర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Recent Comments