భారత్ ప్రొఫెషనల్ నెట్‌వర్క్ (BPN) రియాద్ నెట్‌వర్కింగ్ మీట్ విజయవంతంగా నిర్వహణ
రియాద్, మే 10:
భారత్ ప్రొఫెషనల్ నెట్‌వర్క్ (BPN) ను సాటా వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెసన్ & టీమ్ విజయవంతంగా నిర్వహించిన నెట్‌వర్కింగ్ మీట్ రియాద్‌లోని మలాజ్ ప్రాంతంలోని చెర్రీస్ రెస్టారెంట్‌లో ఉత్సాహభరితంగా మరియు ప్రభావవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియాలోని వివిధ రంగాలకు చెందిన భారతీయ ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, సామాజిక సేవకులు మరియు కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సమావేశం ద్వారా ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్, ఆలోచనల మార్పిడి, సహకార అవకాశాలు, మెంటర్‌షిప్ మరియు భారతీయ సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేసే వేదికగా నిలిచింది.
హెల్త్‌కేర్, ఐటీ, ఇంజనీరింగ్, ఫైనాన్స్, ఏవియేషన్, కాంట్రాక్టింగ్, కన్సల్టింగ్, ఎడ్యుకేషన్, ఫార్మాస్యూటికల్స్, హాస్పిటాలిటీ మరియు పబ్లిక్ సర్వీసెస్ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రముఖ అతిథులలో ఆస్టర్ సనద్ హాస్పిటల్‌కు చెందిన భారత్ షా, BYBit నుండి రషీద్, సౌదీ అరాంకో నుండి రామ్ రిలంగి & షాహెద్ సయ్యద్, KPMG నుండి దీపక్ జగాసియా, కింగ్ సౌద్ యూనివర్శిటీ ఫార్మకాలజీ విభాగానికి చెందిన డా. ఫైసల్ ఇమామ్, అవలాన్ ఫార్మా నుండి మొహమ్మద్ సిద్ధిక్, అల్‌బిలాద్ క్యాపిటల్ నుండి ప్రతీక్ గోసర్, దిరియాహ్ నుండి మొహమ్మద్ ఖమర్ ఇక్బాల్, రెడ్ సీ గ్లోబల్ నుండి జిత్వార్ పూజారి, ఫ్లైనాస్ నుండి అబు సయీద్ మరియు ముస్తాక్ అహ్మద్, ఆల్ఫా స్టార్ ఏవియేషన్ నుండి మొహమ్మద్ అష్ఫాక్, ఆల్టెరా క్యాపిటల్ నుండి అజారుద్దీన్, GOSI నుండి రమేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
సమాజ ప్రతినిధులుగా సచిన్ వంజారా (గుజరాత్), హఫీజ్ ఖాన్, అబ్దుల్ కరీం, మొహమ్మద్ షేక్ (ముంబై), అజారుద్దీన్ (కేరళ), అమీరుద్దీన్ (హైదరాబాద్), అర్బాజ్ అట్టార్ (ముంబై), చాన్సా రెహ్మాన్ మరియు నాస్ పొన్నై (కేరళ) పాల్గొన్నారు.

PBD అవార్డు గ్రహీత శ్రీ షిహాబ్ కుట్టుకాడ్ ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్, యువ ప్రతిభలు, వ్యాపారవేత్తలు మరియు సామాజిక సేవకులు పరస్పరం కలుసుకొని, చర్చించి, అభివృద్ధి అవకాశాలను అన్వేషించేందుకు ఇది ఒక అద్భుత వేదికగా నిలిచిందని పేర్కొన్నారు.
చర్చలలో ప్రొఫెషనల్ అభివృద్ధి, బిజినెస్ నెట్‌వర్కింగ్, మెంటర్‌షిప్ అవకాశాలు, కెరీర్ మార్గదర్శకత్వం, సామాజిక బాధ్యత మరియు దేశ నిర్మాణంలో భారతీయ ప్రవాసుల పాత్ర వంటి అంశాలు ప్రధానంగా చర్చించబడ్డాయి.
శ్రీ షౌకత్ అలీ, అరవింద్ & నాజియా తమ నిర్వాహక బృందంతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి పాల్గొనేవారికి, వాలంటీర్లకు, కోఆర్డినేటర్లకు మరియు మద్దతుదారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా BBN ఇండస్ట్రియల్ నిపుణులు మరియు అతిథి వక్తలైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రీ ఖాన్, గద్వాల్‌కు చెందిన శ్రీ ఫైజుద్దీన్, హైదరాబాద్‌కు చెందిన అమీరుద్దీన్ మరియు అర్షద్ ఖాజీ మాట్లాడుతూ, భారత్ ప్రొఫెషనల్ నెట్‌వర్క్ (BPN) భవిష్యత్తులో కూడా ఇలాంటి అర్థవంతమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ, సౌదీలో నివసిస్తున్న భారతీయుల మధ్య ప్రొఫెషనల్ ఐక్యత, జ్ఞాన పంచకం, నాయకత్వ వికాసం మరియు పరస్పర అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమం భారతీయ సమాజంలో ఐక్యత, సహకారం మరియు అభివృద్ధి దిశగా ఒక బలమైన సందేశంతో ముగిసిందనీ ఇటువంటి కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తామని ఈస్ట్రన్ సాటా ప్రెసిడెంట్ తేజ మరియు సెంట్రల్ రియాద్ ప్రెసిడెంట్ మచ్చా శ్రీనివాస్ లు తెలియచేసారు.



Recent Comments