9 తెగల ఆదివాసి గిరిజనుల సంఘం, తుడుందెబ్బ బోథ్ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం మహేందర్
— ఇచ్చోడ ఎక్సైజ్ సిఐ కి వినతి పత్రం
ఇచ్చోడ, మార్చి 06.2026 : ఏజెన్సీ మండల కేంద్రమైన ఇచ్చోడలో బెల్ట్ షాపులన్నింటినీ తక్షణమే మూసివేయాలని లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడు తామని తుడుం దెబ్బ బోథ్ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం మ హేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇచ్చోడా ఎక్సైజ్ సీఐకి ఒక వినతి పత్రం సమర్పించారు. ఏజెన్సీ మండల కేంద్రమైన ఇచ్చోడలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఎక్కడపడితే అక్కడ దాదాపు 60 బెల్ట్ షాపులు తెరిచారని తక్షణమే వాటిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
బెల్ట్ షాపుల పట్ల పోలీసులు ఎక్సైజ్ అధికారు లు పక్షపాత ధోరణి అవలంబి స్తున్నారని, ఆదివాసి గిరిజనులు పొట్టకూటి కోసం బెల్ట్ షా పులు పెట్టుకుంటే వాటిని మూసివేస్తున్నారని, ఆదివాసి గిరిజన యువకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, గిరిజనేతరులు బెల్ట్ షాపులు తెరుస్తే అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆయన ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసి గిరిజనుల హక్కుల ను చట్టాలను అధికారులే హరించి వేస్తున్నారని ఆరోపించా రు. ఇచ్చోడ మండల కేంద్రం లో బెల్ట్ షాపులను ఎత్తివేయనట్లయితే ఇంతటి ఆందోళన కైనా సిద్ధంగా ఉన్నామని, వారం రోజుల్లోగా వాటిని ఎత్తి వేయాలని లేదంటే ఇచ్చోడ మండల కేంద్రంలోనీ అంబేద్కర్ విగ్రహం ముందు అమరణ నిరాహార దీక్ష చేపడతామని డిమాండ్ చేశారు.


Recent Comments