ePaper
Tuesday, March 3, 2026
📄 ePaper

గల్ఫ్ ఉద్రిక్తతలపై ఆందోళన వద్దు.. సౌదీలో పరిస్థితులు సురక్షితం: సాటా (SATA) స్పష్టీకరణ

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!


సౌదీ అరేబియా , ఇంటర్నేషనల్ డెస్క్  : ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల భద్రతపై వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న తరుణంలో సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ప్రతినిధులు స్పందించారు. ఈ మేరకు సాటా రియాద్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సౌదీలో ఉన్న తెలుగువారు మరియు ఇతర భారతీయులంతా సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు.


ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు లేవని ఆయన స్పష్టం చేశారు. సౌదీ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, అలాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సౌదీతో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారి సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయని ఆయన వివరించారు.


కుటుంబ సభ్యులు ఎలాంటి అనవసర ఆందోళనలకు గురికావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసర సమాచారం లేదా సహాయం అవసరమైతే ప్రముఖ తెలుగు సంఘాలైన SATA మరియు TASA ప్రతినిధులను లేదా రియాద్‌లోని భారత ఎంబసీని సంప్రదించాలని సూచించారు.
సహాయం కోసం సంప్రదించాల్సిన వివరాలు:
* సాటా (SATA) వెబ్‌సైట్: http://www.sataksa.com
* టాసా (TASA) వెబ్‌సైట్: https://www.tasaksa.org/
రియాద్‌లోని భారత ఎంబసీ (24/7 హెల్ప్‌లైన్):
* ఫోన్: 00-966-11-4884697
* వాట్సాప్: 00-966-542126748
* టోల్-ఫ్రీ: 800 247 1234

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!