గల్ఫ్ ఉద్రిక్తతలపై ఆందోళన వద్దు.. సౌదీలో పరిస్థితులు సురక్షితం: సాటా (SATA) స్పష్టీకరణ

సౌదీ అరేబియా , ఇంటర్నేషనల్ డెస్క్  : ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల భద్రతపై వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న తరుణంలో సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ప్రతినిధులు స్పందించారు. ఈ మేరకు సాటా రియాద్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సౌదీలో ఉన్న తెలుగువారు మరియు ఇతర భారతీయులంతా సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు...