* పత్తి చేనుల్లో దొంగతనాలు, సోలార్ బ్యాటరీల చోరీ – ఐదు కేసులు నమోదు
* 30 కిలోల దొంగ పత్తి, బొలెరో మ్యాక్స్ వాహనం స్వాధీనం
– బోథ్ సిఐ డి. గురుస్వామి
ఆదిలాబాద్ : బోథ్ మండల కేంద్రంలోని కౌట బి గ్రామంలో పత్తి చేనుల్లో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల మేరకు బోథ్ పోలీస్ శాఖ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో తేది 25-01-2026 న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు గ్యాంగ్‌గా ఏర్పడి పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది.
అరెస్టు అయిన నిందితులు
1. సుంకరి చిలకయ్య,
2. Sk నాసిర్,
3. మామిడి శ్రీనివాస్,
4. అశోక్,
5. రాజారాప దత్తు,
6. Sk షాపి కాగా, వీరితో పాటు దొంగ సరుకును కొనుగోలు చేసిన
7. అల్లం చెందర్ ను కూడా అరెస్టు చేశారు.
నిందితుల విచారణలో వీరు ఇప్పటివరకు కౌట బి గ్రామ శివారులోని నాలుగు పత్తి చేనుల్లో దాదాపు 5 క్వింటాళ్ల పత్తిని దొంగతనం చేయడంతో పాటు, ఒక చేనులోని సోలార్ ప్యానెల్, బ్యాటరీలను కూడా చోరీ చేసినట్లు వెల్లడైంది. దొంగిలించిన పత్తిని అల్లం చెందర్ కు విక్రయించగా, అతడు అవి దొంగ పత్తి అని తెలిసినా తన బొలెరో మ్యాక్స్ వాహనం ద్వారా తరలించి విక్రయించినట్లు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి 30 కిలోల దొంగిలించిన పత్తి, దొంగతనాల ద్వారా వచ్చిన నగదు రూ.9,600/-, బొలెరో మ్యాక్స్ వాహనం, సోలార్ ప్యానెల్, బ్యాటరీలను స్వాధీనం చేసుకుని, మొత్తం 7 గురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు బోథ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి. గురుస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమం లో బోథ్ ఎస్ఐ వి పురుషోత్తం, హెడ్ కానిస్టేబుల్ హాఫీజ్, కానిస్టేబుల్ రాహుల్, కళ్యాణ్, సంజీవ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Recent Comments