Friday, November 22, 2024

ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70, 1/59 చట్టాల్ని పకడ్బందీగా అమలు చేయాలి


ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 యాక్ట్ ప్రకారం క్రయవిక్రయాలు నిలిపివేయాలి…..
పేసా కమిటీకి అభివృద్ధి నిధులు కేటాయించాలి ……
9 తెగల ఆదివాసీల కుల పెద్దల తీర్మానం …

రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్హతనూర్ :
ఏజెన్సీ చట్టాలు మరియు హక్కులను కాపాడుకోవడానికి 9 తెగల ఆదివాసీ సంఘాల నాయకులు నడుంబిగించారు.
బజారుత్నూర్ మండలంలో  ఏజెన్సీ చట్టాలు అమలు పరచకపోవడం  వలన తమకు అన్యాయం జరుగుతుందని ఆదివాసీ నాయకులు ఒక ప్రకటన లో పేర్కొన్నారు.  మండలంలోని డేగమ  గ్రామం ‘ ఏజెన్సీ – గ్రామని , ఆ గ్రామంలో సర్వేనంబర్ 63 /ఆ లో అక్రమ కట్టాడాలు నిర్మిస్తున్నారని అన్నారు.   అదేవిధంగా బజార్ హత్నూర్ లోని మండల సర్వే నంబర్ 37 లో అక్రమ లే అవుట్లు వేసి ప్లాట్లు విక్రయాలు జరుపుతున్నారని మండిపడ్డారు . మండలంలోని ఏజెన్సీ ప్రాంత సర్వేనంబర్ 131 లోకూడా   క్రయవిక్రయాలు చేస్తున్నారని అన్నారు.  బలాన్పూర్ ఏజెన్సీ శివారంలోని సర్వేనం  13 లో 26  ఎకరములు భూమి పై ఎల్టీఆర్ (LTR)  కేసు నమోదు అయిన భూమి నుండి  4 ఎకరముల భూమిని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉట్నూర్ ద్వారా  అధివాసులకు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు.   ఆదివాసులకు పంపిన భూమి తీసివేయగా   మిగులు భూమి 22 ఎకరాల
భూమి గిరిజనేతరులు స్వాధీనంలో ఉంది కాబట్టి , ఆ  భూమిని ప్రభూత్వ ఆధీనంలో తీసుకోవాలని ఆదివాసీ నాయకులు అధికారులను కోరారు.
ఈ సందర్భంగా ఈ క్రింది డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహశీల్దార్ కు అందించారు.

  1. పెసా మరియు 1/70 1/59 చట్టాలను ఖచ్చితంగా అమలుపరచాలి , మరియు పెసా కమిటి ద్వారా ఎన్నిక అయినటువంటి సభ్యులకు విటీడీఏ ద్వార అభివృద్ది పనులు కోనసాగించాలి. 
  2. పెసా కమిటిలో ఎన్నిక అయినటువంటి సభ్యులకు ‘ ఎన్నిక పత్రములు వెంటనే జారి చెయ్యలి . ఏజెన్సీలో క్రయవిక్రయాలు చట్టం ప్రకారంగా ఈ నిలుపి వేయ్యాలి .
  3. ఏజెన్సీలో పెసా చట్టం ప్రకారం ఆదివాసులు తీర్మారించిన గ్రామ సభ తీరాగాలు అమలు పరిచాలి .
  4. ఏజేస్సలో బెల్ట్ షాపులు రద్దు చేయ్యాలి .
  5. ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ కట్టడాలు నిలిపివేయ్యాలి .
  6. ఏజెన్సీ ప్రాంతంలో సాగుచేస్తున్న భూములకు ఆర్వో ఎఫ్ ఆర్ హక్కుపత్రాలు జారీ చేయాలి.
           ఈ కార్యక్రమంలో 9 తెగల ఆదివాసీ సంఘాల కుల పెద్దలు నైతం  రమేష్,  ఉయిక  సుదర్శన్ వడ్డి ఉత్తం , ఆత్రం బాపురావ్ ,  జెడిక్ నారాయన్,  పాండురంగ్ ,  మేస్రం కేశవ్ ,   సిడం గంగాధర్ ,  కుంచం గంగాధర్ , తోడసాం ఇస్తారి లు పాల్గొన్నారు.

Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి