epaper
Saturday, January 24, 2026

కేశవపట్నంలో 82 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు,1 మాక్స్ స్వాధీనం

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!
  • కేశవపట్నం లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం, 82 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు,1 మాక్స్ స్వాధీనం.
  • చదువు పై ఉన్న ప్రాధాన్యతను తెలియజేసిన జిల్లా ఎస్పీ.
  • ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాల నిర్వహణ చట్టరీత్యా నేరం.
  • విద్యార్థులను చదువుకునేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచన.వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి.
  • ప్రజల సంరక్షణ, భద్రతకై కమ్యూనిటీ కాంటాక్ట్ ల నిర్వహణ, సిసి కెమెరాల ప్రాధాన్యత పై వివరణ.
  • 160 మంది సిబ్బందితో ఉదయం 5 గంటల నుండి తనిఖీలు, పాల్గొన్న 20 మంది మహిళ పోలీసు అధికారులు, సిబ్బంది. నార్కోటిక్ డాగ్ రొమ తో గంజాయి పై తనిఖీ



– జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

ఆదిలాబాద్, ఇచ్చోడ :  ప్రజల రక్షణ, సంరక్షణ సక్రమంగా నిర్వహించడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ అండ్ సెర్చ్) లను నిర్వహించడం జరుగుతుందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. ఉదయం ఐదు గంటల నుండి 160 మంది సిబ్బందితో ఉట్నూర్ అడిషనల్ ఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్, ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్  ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సరైన ధ్రువపత్రాలు లేనటువంటి 82 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు, ఒక మ్యాక్స్ వాహనం తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నార్కోటిక్ డాగ్ రోమా సహాయంతో గంజాయి కై తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు.

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం గ్రామానికి చేరుకోని ప్రజలతో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్, మొదటగా గ్రామాన్ని అధికారులతో కలిసి తిరిగి  విద్యార్థులకు చదువుపై ఉన్న ప్రాధాన్యతను తెలియజేశారు. ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని తల్లిదండ్రులు యువతకు చదువుకునేలా ప్రోత్సహించాలని, చదువు వలన భవిష్యత్తు, మంచి పేరు లభిస్తాయని సూచించారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా ఉండాలని సూచించారు. ఒకే గ్రామం నుండి గత ఐదు సంవత్సరాలలో 90 కేసులు నమోదు అయ్యాయని, ఇక నుండి సన్మార్గంలో వెళ్లాలని సూచించారు.

గ్రామంలో నమోదైన రౌడీషీట్లు, సస్పెక్ట్ షీట్లను పరిశీలించడం జరుగుతుందని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనని వారిపై ఒక సంవత్సరం పాటు పరిశీలించి రౌడీ షీట్లను, సస్పెక్ట్ షీట్లను ఎత్తివేయడం జరుగుతుందని తెలిపారు. అక్రమంగా కలప రవాణాను, చెట్లను నరికి వేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.

రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా ప్రతి ఒక్కరు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను తెలియజేస్తూ వాటి ఏర్పాటకు కృషి చేయాలని తెలిపారు. మహిళల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ ఉండాలని ఎలాంటి గృహహింస చర్యలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. రాత్రి సమయాలలో అనవసరంగా తిరగరాదని, ఈవిటీజింగ్ మరియు మహిళలను వేధించడం లాంటివి నిర్వహించకూడదని, గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి పోతారం శ్రీనివాస్, ఇచ్చోడ సిఐ బండారి రాజు, ఉట్నూర్ సీఐ ఎం ప్రసాద్, ఎస్సైలు వి పురుషోత్తం, వి సాయన్న, ఎల్ శ్రీకాంత్, ఇమ్రాన్, డి రాధిక, పూజ, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్ హక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!