మట్కా నిర్వాహకుని అరెస్టు చేసిన స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి

📰 Generate e-Paper Clip

*మట్కా చిట్టీలు,రూ 1240 స్వాధీనం…..  ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు*


రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శుక్రవారం ఉదయం 12 గంటల సమయంలో ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో పరిధిలోని హ్యాండీ క్యాప్ ఏరియాలో మట్కా నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో మేరకు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి, ఎస్ఐ కే విఠల్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం వలపన్ని నిందితులను పట్టుకున్నారు. మట్కా నిర్వహిస్తున్న నిందితుడు
షేక్ కలీం (48) ను తనిఖీ చేయగా మట్కా చిట్టీలు మరియు అతని వద్ద నుండి రూ.1240 స్వాధీనం చేసుకుని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి,తదుపరి దర్యాప్తు నిమిత్తం కోసం అప్పగించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్లో స్పెషల్ బ్రాంచ్ ఎస్సై కే విఠల్, కానిస్టేబుల్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments