ఆదిలాబాద్ జిల్లా గుండాల గ్రామంలో ఉద్రిక్తత…. ఇరువర్గాల మధ్య ఘర్షణ…
Thank you for reading this post, don't forget to subscribe!- పత్తి చోరీ చేయడానికి వచ్చాడని సర్పరాజ్ అనే యువకుడి ని దేహశుద్ధి చేసిన వైనం…
- పత్తి చోరికి కాదు…. యువతి పిలిస్తేనే వెళ్ళాను అన్న యువకుడు….
- అవమాన భారంతో పురుగుల మందు తాగి 13 సంవత్సరాల యువతి ఆత్మహత్య….
- తుపాకీతో గాల్లో కాల్పులు జరిపారని ఒక వర్గం ఆరోపణ….
రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండలంలోని గుండాల గ్రామంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.
మృతురాలి తండ్రి షేక్ అష్రఫ్ అలీ ఆలియాస్ గులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రోజు ఎల్లమ్మగూడ గ్రామ శివారులో గల తన పత్తిచేనులో పత్తి ని ఏరి ముళ్ళే లు సరి చేస్తుండగా అంతలో గుండాల గ్రామానికి చెందిన షేక్ సర్పరాజ్ అను అతను దొంగతనం గా ఒక పత్తి ముల్లెను ఎత్తుకుని పోవడానికి ప్రయత్నం చేసినట్లు వెంటనే అతన్ని పట్టుకున్నట్లు తెలిపారు.

అయితే ఇదే విషయం పై మరుసటి రోజు అనగా గురువారం రోజు ఉదయం గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి అతని పై నిర్ణయం తీసుకుండామనుకుంన్నానని అన్నారు.
కానీ ఉదయం 7 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన రఫిదా , శంషాద్ లు తన ఇంటికొచ్చి ని భార్యతో మరియు ని కూతురు ఇశ్రాత్ బి తో ఇద్దరితో సర్పరాజ్ కు అక్రమ సంబంధం ఉందని ఇంటికొచ్చి తప్పుడు అపనింద వేశారని పేర్కొన్నాడు. ఇట్టి మాటలను విన్న తన కూతురు ఇశ్రాత్ బి (13) అపనింద భరించలేక పురిగుల మందు తాగిందని పేర్కొన్నాడు.
ఇది గమనించి చికిత్స కోసం ఇచ్చోడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నర్సాపూర్ గ్రామ సమీపంలో మృతిచెందినట్లు తెలిపాడు.
నా కూతురి ఆత్మహత్య కు కారణమైన సర్పరాజ్ , రఫిదా, శంషాద్, షేక్ మతీన్, సిరాజ్ , ఇస్మాయిల్, షేక్ జుమా, నజ్జు@షేక్ హసన్ , షేక్ జావిద్ , షేక్ అహ్మద్ మరియు ఇంకొంత మంది తన కూతురిని సూటిపోటి మాటలతో నిందించి ఆమె మరణానికి కారమయ్యారని పిర్యాదు చేసారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరాడు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫరీద్ తెలిపారు.
Recent Comments