కత్తిపోట్లతో కడుపులో నుంచి బయటకు వచ్చిన పేగులు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ: ఇద్దరు దుండగులు ఒక లారీ డ్రైవర్ ను కత్తితో పొడిచి పరారైన సంఘటన మండలంలో కలకలం రేపుతోంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..రములయ్య అనే లారీ డ్రైవర్ లారీని సరుకులతో విజయవాడ నుండి ఢిల్లీ తీసుకో వెళ్తున్న క్రమంలో విశ్రాంతి కొరకు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై, ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ ముందు ఉన్న “బే”లో లారీ నిలిపి నిద్రిస్తున్న క్రమంలో తెల్లవారుజామున 4.30 ప్రాంతంలో ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి ఆ లారీ డ్రైవర్ను డబ్బులు అడగగా, డబ్బులు లేవు అని లారీ డ్రైవర్ చెప్పడంతో ఆ దుండగులు లారీ డ్రైవర్ పై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో డ్రైవర్ కడుపులో నుండి పేగు బయటకు వచ్చింది. చికిత్స కోసం సదరు లారీ డ్రైవర్ స్వయంగా తానే లారీ నడుపుకుంటూ హాస్పటల్ వెళ్తున్న క్రమంలో బైపాస్ నుండి మండల కేంద్రంలోకి ఎంట్రీ అయ్యే ప్రదేశం వద్ద అచేతన స్థితిలోకి వెళ్లిపోయి, రోడ్డుకు అడ్డంగా లారీ నిలిపివేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. జాగింగ్ కు వెళ్తున్న యువకులు గమనించి 108 సిబ్బందికి సమాచారం అందించగా,108 సిబ్బంది లారీ డ్రైవర్ను చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు. 108 సిబ్బందిని మండల ప్రజలు యువకులు ప్రశంసిస్తున్నారు.
Recent Comments