రిపబ్లిక్ హిందుస్థాన్ నల్లబెల్లి: నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం గ్రామంలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజు ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు గత కొద్ది రోజులుగా కుటుంబంలో జరుగుతున్న గొడవల వలన మనస్థాపానికి గురై మంగళవారం తెల్లవారుజామున ధర్మారం దగ్గరలోని రైల్వే పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు, రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments