మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసినందుకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించిన పొక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డి మాధవి కృష్ణ
నిందితునికి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 1500 ల జరిమానా
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలం దుబార్ పేట గ్రామానికి చెందిన మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసినందుకు నిందితుడికి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించిన పొక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డి మాధవి కృష్ణ.
కేసుపూర్వపరాలు
వివరాల్లోకీ వెళితే ఇచ్చోడ మండలంలోని 17 సంవత్సరాల మైనర్ బాలిక పనికి వెళ్లి ఇంటికి రాకపోవడంతో, తన తల్లి కంగారులో వెతికిన దొరకకపోవడంతో తన బంధువు ద్వారా 1-5-2016 న ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా మొదట బాలిక కనబడుటలేదు అని కేసు నమోదు చేసి క్రైమ్ నెంబర్ 67/2016 అప్పటి ఎస్ ఐ డి లక్ష్మణ్ కేసు నమోదు చేశారు. అమ్మాయిని వెతుకుతుండగా ఆమె 1-05-2016 న ఇంటికి తిరిగి రాగా ఆమెను విచారించగా నేరస్థుడు మేశ్రం మారతి S/O రాములు వ” 30 దుబార్ పేట్ కీ చెందిన వ్యక్తి అమ్మాయితో ఒక ఒక సంవత్సరము నుండి పరిచయం పెంచుకొని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తేదీ 21-04-2016 న ఆమెను తీసుకుని 12:30 గంటలకు ఇచ్చోడా నుండి నిజామాబాద్ ద్వారా షిరిడి తీసుకువెళ్లి అక్కడ లాడ్జిలో ఉంచి చాలా సార్లు మాన భంగం చేసినాడు.
అమ్మాయి ఇచ్చిన బంగ్మూలం ఆధారంగా అప్పటి సీఐ పోతారం శ్రీనివాస్ sec 376(2)(m),366.A,IPC ,Sec 4 ఫోక్సు చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ బాధితురాలిని హాస్పిటల్కు పంపించారు.
తర్వాత ఈ కరుణాకర్ అప్పటి సీఐ ఇచ్చోడా ఇట్టి కేసులో దర్యాప్తు చేస్తూ 20 మంది సాక్షులను విచారించి నేరస్తుని అరెస్టు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయగా, కోర్టు విధుల అధికారి బి ఎస్ గౌతం సాక్షులకు సమన్లు అందజేసి కోర్టుకు వచ్చే విధంగా చూడగా, ప్రత్యేక పీపీ ముస్కు రమణారెడ్డి 15 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి నేరం రుజువు చేయగా ఈరోజు ఫోక్సోకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి డి మాధవి కృష్ణ గారు తీర్పు వెలువరిస్తూ ముద్దాయి మేష్రం మారుతి కి సెక్షన్ సిక్స్ ఫోక్సు చట్టం క్రింద మైనర్ అమ్మాయిని మానభంగం చేసినందుకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ 1000/- జరిమానా, మరియు 366-A ఐపిసి కింద రెండు సంవత్సరములు మరియు రూ 500/- జరిమానా విధించారు.
స్పెషల్ పీపీ ముస్కు రమణారెడ్డి, కోర్టు డ్యూటీ అధికారి గౌతమ్, లైసెన్ అధికారి ఎం గంగా సింగ్ లను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి, ఉట్నూర్ ఎఎస్పి హర్షవర్ధన్ శ్రీవాస్తవ ప్రత్యేకంగా అభినందించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments