16,477 అభ్యర్థులకు గాను 15,619 అభ్యర్థులు పరీక్షకు హాజరైనారు, 858 అభ్యర్థులు గైర్హాజరు
జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
రాష్ట్రవ్యాప్తంగా కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఈరోజు అన్ని ప్రధాన కేంద్రాలలో జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ పట్టణం ఉట్నూరు పట్టణం నందు 49 పరీక్షా కేంద్రాలలో 15,619 మంది అభ్యర్థులు హాజరై విజయవంతంగా పరీక్షను రాసి పూర్తి చేశారు, జిల్లాలో 858 మంది గైర్హాజరైనారు. ఈ పరీక్షకు జిల్లా పోలీసు వ్యవస్థ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సి సమయ్ జాన్ రావు నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ అన్ని కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ఈ పరీక్షను పూర్తి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి లు వి ఉమేందర్, ఉమామహేశ్వరరావు, సిఐలు పి సురేందర్, కె శ్రీధర్, జి మల్లేష్, జెకృష్ణమూర్తి, కె మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments