Saturday, August 30, 2025

మానవ అక్రమ రవాణా, లైంగిక వ్యాపారం, సైబర్ ఆధారిత అంశాల పైన వివోఓబి, వివోఏలకు శిక్షణ కార్యక్రమం

బోథ్ ఏపిఎం  మాధవ్

ఆదిలాబాద్ జిల్లా : బోథ్ మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో గురువారం మానవ అభివృద్ధి  విభాగంలో భాగంగా మానవ అక్రమ రవాణా. లైంగిక వ్యాపారం. సైబర్ ఆధారిత. అక్రమ రవాణా అంశాల పైన గ్రామ సంఘాల ఓబి లకు గ్రామ సంఘాల అసిస్టెంట్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా బోథ్ మండల మహిళా సమాఖ్య కార్యాలయంల మండల టి ఓ టి టీమ్స్ ఏపీఎం మాధవ్ సీసీలు సంజీవ్ గంగాధర్ సామాజిక కార్యకర్త జక్కుల వెంకటేష్ గ్రామ సంఘాల ఓబి లకు ఈ గ్రామ సంఘాల వివయలకు మానవ అక్రమ రవాణా లైంగిక వ్యాపారం సైబర్ ఆదారిత అక్రమ రవాణా అంశాల పైన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా  ఏపి ఎం  మాధవ్ మాట్లాడుతూ. మానవక్రమ రవాణా అంటే ఏమిటి మానవక్రమ రవాణా ఎలా చేస్తారు. అక్రమ రవాణాలలో ఎవరిని టార్గెట్ చేస్తారు. ఏ విధంగా మాయ మాటలతో తప్పు దోవ పట్టిస్తారు. ఎటువంటి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తారు మంచి ఉపాధి కల్పిస్తామని ఇలా నమ్మిస్తారు తిరిగి అక్రమ మానవ రవాణా చేయడంలో ఎవరెవరు కీలకపాత్ర వహిస్తారు. ఎవరు ఎవరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు.

Thank you for reading this post, don't forget to subscribe!

తదితర అంశాల పైన వివరించారు. సీసీ సంజీవ్ మాట్లాడుతూ ఈ మధ్యలో సైబర్ ఆధారిత నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని మహిళలు ముందు జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా మీకు డబ్బులు వచ్చినాయి మీ ఓటిపి నంబర్ చెప్పండి మీకు డబ్బులు వేస్తాము అని ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులకు ఫోన్ చేస్తే ఈ పరిస్థితిలో వాళ్లకు మన ఓటీపీ గాని మన సమాచారం ఏమీ కూడా ఇవ్వకూడదని అన్నారు. ప్రతి మహిళ మానవ అక్రమ రవాణా నిషేధిత గంజాయి క వ్యాపారం చేసేవాళ్లు శిక్షలు ఏ విధంగా ఉంటాయి వాటికి సంబంధించిన సెక్షన్లు శిక్షలు జరిమానాల గురించి వివరించారు. సీసీ గంగాధర్ మాట్లాడుతూ. పిల్లలకు మహిళలకు సైబర్ నేర ఆధారిత నేరాలు జరిగినప్పుడు వెంటనే మహిళలు ఈవోలు స్పందించవలసిన టోల్ ఫ్రీ నెంబర్ ల గురించి వివరించారు మహిళలకు అన్యాయం జరిగితే 100 108 181 ఆడపిల్లలకు అన్యాయం జరుగుతే టోల్ ఫ్రీ నెంబర్ 1098 నూ సైబర్ నేరాలు జరుగుతే 1930 నంబర్లను సబ్ బ్రాండ్ నుంచి వెంటనే ఫోన్ చేయాలని ఫోన్ చేస్తే పోలీసులు  వెంటనే వారిని రక్షించే అవకాశం ఉంటుందని అన్నారు. బోథ్ సామాజిక కార్యకర్త పక్షి ప్రేమికుడు జక్కుల వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తిపాస్తులు ధనము ఇవ్వకుండా పరవాలేదు కానీ చిన్న వయసు నుంచి ఆడపిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు మంచి జ్ఞానము తెలివితేటలు మంచి విద్యను చదివించి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమ్మ జీజా భాయ్ తయారు చేయాలని అప్పుడే వారు నిద్ర యొక్క శక్తుల నుంచి వారికి వారే రక్షణ కల్పించుకుంటారని అన్నారు. టీవీలలో సినిమాలలో సీరియల్ చెడిపోకుండా ముందు జాగ్రత్తగా. ప్రతి తల్లిదండ్రుల పిల్లలకు కరాటే లాటిపింపడం తమకు తాము ఎలా రక్షించుకోవాలని మంచి నైపుణ్యం గల విద్యను అందించి వారికి నైతిక విలువలను తెలియజేసి కలియుగంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణా మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు అత్యాచారాలు లైంగిక వ్యభిచారాలు పైన తల్లిదండ్రులతో తమ పిల్లలకు ముందు జారుగా తెలియజేయాలని మానవ అక్రమ రవాణా ఎలా పాల్పడుతున్నారు ఎలా మోసం చేస్తున్నారు మోసపోకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్త పాటించాలి. అలా ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే వారి నుంచి మనం ఎలా రక్షణ పొందాలి ఎవరిని సంప్రదించాలి తదితర అంశాల పైన తల్లిదండ్రులతో తమ పిల్లలకు అవగాహన కల్పించాలని అన్నారు.గంగాధర్ మాట్లాడుతూ ప్రతి గ్రామ సంఘం అధ్యక్షురాలు గ్రామ సంఘాల వివోఏలు మానవ అక్రమ రవాణా లైంగిక వ్యాపారం సైబర్ ఆధారిత నేరాలు మద్యం విక్రయాలు గంజాయి స్మైలింగ్ జరగకుండా మీ మీ గ్రామంలో ఉన్న మహిళా సంఘ సభ్యులకు టీనేజ్ ఆడపిల్లలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత మీపై ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై ఈ అక్రమ రవాణా నివారించడం కోసం సమిష్టిగా గ్రామస్తుల సహకారంతో గుర్తిస్తాయిలో నివారించాలని అన్నారు. ప్రతి వివోఏ గ్రామ సంఘం సమావేశంలో మానవ అక్రమ రవాణా లైంగిక వ్యాపారం సైబర్ ఆదారిక నేరాలు పైన ఒక ఎజెండా అంశంగా పెట్టి ప్రతి గ్రామ సంఘన సమావేశంలో వైన్ సాగసంఘాలక వివరించాలని కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల సమాఖ్య కార్యదర్శి శివంతా స భాయి సీసీలు గ్రామ సంఘాల ఓబీలు గ్రామ సంఘాల వివో ఏలు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి