రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో తెరాస పార్టీ నాయకులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఉరకలెత్తే ఉత్సాహముతో రోజుల పదుల గ్రామాల్లో మండల నాయకులు పర్యటిస్తూ గ్రామ కమిటి లను ఎన్నుకుంటున్నారు. పార్టీ అధిష్టాన ఆదేశానుసారం, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సూచనల మేరకు మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి నాయకత్వములో గ్రామ కమిటీల ఏర్పాటు విజయవంతంగా కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు. యువత గ్రామ కమిటీల్లో స్థానం కోసం ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని అన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!శనివారం రోజు మాల్యాల గ్రామములో బత్తుల పంజాబ్ రావు ను, తలమద్రీ లో పాముల రామారావు ను, హిరపూర్ లో రాథోడ్ సునీల్ కుమార్ ను, దాబా కె లో పార్డే దొండిబాను , దాబా బి లో మటపతి ఓంకార్ ను గ్రామ గ్రామ అధ్యక్షులుగా మరియు ఆయా గ్రామాల కార్యవర్గాలను ఎన్నుకొని,నియామక పత్రాలను అందించారు.
కన్వీనర్ మాట్లాడుతూ గ్రామ గ్రామన ముక్యంగా యువత ముందుకు వచ్చి గ్రామ కమిటీల్లో భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉందని,ఇది ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పని తనానికి నిదర్శనమని అన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రితం రెడ్డి , ఆత్మ ఛైర్మెన్ నరాల రవీందర్ , వైస్ ప్రెసిడెంట్ ముస్తఫా, అబ్దుల్ రషీద్,దాసరి భాస్కర్,సర్పంచ్లు శ్రీహరి, లావణ్య రాజు, ఉప సర్పంచులు అక్కపెల్లి సుమన్, గణేష్ లు,సిరాథోడ్ ప్రకాష్, కడమంచి భీముడు,మైల మహేష్,కలీమ్ తదితరులు పాల్గొన్నారు..
Recent Comments