- – సరిహద్దు నుండి వచ్చే వారికి థర్మల్ స్క్రిన్నింగ్ చేయని సిబ్బంది

రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ : తెలంగాణ లో రోజుకు రోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోవిడ్ నియంత్రణ పై నిర్వహించిన సమావేశంలో మహారాష్ట్ర సరిహద్దు నుండి వచ్చే వారికి థర్మల్ స్క్రిన్నింగ్ తప్పనిసరి చేస్తు ఆదేశాలు జారీ చేశారు. కానీ అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాలను భేఖాతారు చేస్తూ దర్జాగా మహారాష్ట్ర నుండి వచ్చే వారికి ఎలాంటి టెస్టులు చేయడం లేదు. జిల్లాలో సైతం కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న అధికార సిబ్బంది ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం , ఉన్నతాధికారుల ఆదేశాలు పట్టించుకోక పోవడం గమనార్హం . బోథ్ ఘన్పూర్ చెక్ పోస్టు వద్ద పని చేస్తున్న సిబ్బందిని ఈ విషయం పై అరా తీయగా అక్కడినుండి వచ్చే వారిని ఎవరెవని ఆపాలి, ఆపిన వారు అగరు అని సమాధానం ఇచ్చారు. పేరుకే చెక్ పోస్ట్ కనీసం అక్కడ వాహనాల్లో సరిహద్దులు దాటుతున్న సరుకులను కూడా అధికారులు తనిఖీ చేయడం లేదు. జీరోమాల్ లోడ్ తో వెళ్లే లారీలను తనిఖీ చేయకుండా హైకమాండ్ ఆదేశాలు ఉన్నాయని పెరు వెల్లడించడానికి ఇష్టపడని ఇద్దరు అధికారులు తెలిపారు.
Recent Comments