రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : కుటుంబ సభ్యులు తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఒ యువతి ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన మండలం లోని నావేగాం గ్రామంలో చోటు చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నావేగామ్ గ్రామానికి చెందిన సంజయ్ అనే వ్యక్తి మమత అనే కూతురు ఉంది. కొన్ని రోజుల క్రితం మమతకు పెళ్లి సంబంధం కుదిరి నిశ్చితార్థం అయింది. అయితే మమత కు ఈ సంబంధం ఇష్టం లేదు. ఇదే విషయం ఇంట్లో పలు సార్లు కుటుంబ సభ్యులతో గొడవపడింది. గురువారం రోజు కూడా పెళ్లి వద్దని తల్లిదండ్రులతో గొడవలు జరిగాయి. ఎంత చెప్పిన ఇంట్లో వారు ఒప్పుకోక పోవడం తో మమత (19)మనస్థాపం చెంది ఇంట్లో రాత్రి అందరూ పడుకున్న సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. మృతిరాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని యువతి ఆత్మహత్య
RELATED ARTICLES
Recent Comments