🔴 108 కి ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్పందించలేదని బాధితుల ఆవేదన
🔴 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైద్య ఆరోగ్యాశాఖ మంత్రి హరీష్ రావ్ పర్యటన రోజే ఘటన…..
రిపబ్లిక్ హిందుస్థాన్,ఉట్నూర్ :
సమయానికి వైద్యం అందక ఓ గిరిజన మహిళా మృతి చెందిన సంఘటన ఉట్నూర్ మండలం లో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఉమ్రి గ్రామ పంచాయతీ సాలెగూడ గ్రామం లో టేకం లస్మా,లక్ష్మీబాయి దంపతులకు జంగుబాయి (25)ఒక్కటే కూతురు.
ఆమెకు జ్వరం తో ఉన్నట్టుండి ఒక్కసారిగా శుక్రవారం ఉదయం ఆరోగ్యం క్షిణించడం వల్ల 108 సిబ్బందికి గ్రామస్తులు ఫోన్ చేశారు. అయితే సిబ్బంది వస్తాము అని చెప్పి ఎంతకు రాకపోవడం తో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఆటోలో
ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించాగా, హాస్పిటల్ కి చేరేలోపే ఆమె ప్రాణం పోయింది.
108 సిబ్బంది నిర్లక్ష్యం వలన ఈరోజు ఒక నిండు ప్రాణం బలి అయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 108 సిబ్బంది ఫోన్ చేసిన వెంటనే వచ్చి ఉండి ఉంటే తమ కూతురి ప్రాణం పోయేది కాదని తాము ఆసుపత్రి కి చేరుకున్న 108 జాడ లేదని కుటుంబం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగుబాయి(25) మృతి పట్ల గ్రామంలో హృదయ అనారోగ్యంతో ఆమె శుక్రవారం మృతి చెందింది. మృతురాలికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అభం సుభం తెలియని ఒక పసి బాలుడికి మాతృ వియోగం చెంది దుఃఖ సాగరంలో ఆ కుటుంబం మునిగింది. ఆర్థికంగా ఆడుకోవాలని 5 లక్షలు మంజూరు చేయాలని గ్రామస్తులు తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments