Saturday, April 19, 2025

పిడుగుపాటుకు గురై మహిళ మృతి

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లో శుక్రవారం భారీ వర్షం కురిసింది.  ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో పిడుగు పాటుకు గురై ఖందరే సుగుణ( 25)  అనే మహిళా మృతి చెందింది. పోలీసులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మండలం లోని ముఖ్రా బి గ్రామానికి చెందిన ఖందారే తుకారం అనే రైతు మండలంలోని కొకస్ మన్నుర్ గ్రామ శివారం లో కౌలుకి భూమి తీసుకోని వ్యవసాయం చేసుకుంటున్నాడు. శుక్రవారం వారం రొజు ప్రత్తి విత్తనాలు పెట్టడానికి భార్యభర్తలతో పాటు మరో యువకుడు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. పత్తి విత్తనాలు పెడుతున్న సమయంలో మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగ సుగుణ పిడుగు పై పడడం తో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. మృతిరాలికి భర్త, ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కౌలుకి భూమి తీసుకుని జీవనం కొనసాగిస్తున్న నిరుపేద రైతు కుటుంబం సుగుణ మృతి తో దుఃఖ సాగరం లో మునిగి పోయింది. సుగుణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి