రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపాలనే జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలోని బృందం బుధవారం అర్ధరాత్రి మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్ నగర్, పాలిటెక్నిక్ కళాశాల ఖాళీ స్థలంలో కొందరు పేకాట ఆడుతున్నటు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా, ఎనిమిది మందిని సంఘటన స్థలంలో పట్టుకున్నామని తెలిపారు. ఈ ఎనిమిది మంది వద్ద నుండి పేకాట ముక్కలు, రూ.20,970/- నగదు స్వాధీనం చేసుకుని మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన నిందితులు వివరాలు తెలియజేస్తూ
1) పెంట చంద్రమోహన్
2) దేషెట్టివర్ నందకిషోర్
3) దార విలాస్
4) మిర్దొడ్డి నారాయణ
5) మట్ట రవీందర్
6) దొంతుల హనుమంతులు
7) గాజుల రామ్ మోహన్ రావు
8) పాల్డై వార్ విలాస్
వీరందరూ ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన వారుగా తెలిపారు. వీరిపై మావల పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నంబరు 128/2022 u/sec 9(1) TS gaming act కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్లో సిసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎనిమిది మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
Thank you for reading this post, don't forget to subscribe!


Recent Comments