Wednesday, October 15, 2025

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరెట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నంబర్ 18004251939
ఆర్ అండ్ బి కంట్రోల్ రూమ్ నంబర్
8106128195
ఇరిగేషన్ కంట్రోల్ రూమ్ నంబర్
91873226050
అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్లకు కాల్ చేయాలని కలెక్టర్ తెలిపారు.

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
తెలంగాణలో  రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ కుండపోత వానలు కురిసే అవకాశం ఉన్న సందర్భంగా శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  ఆన్ని జిల్లా కలెక్టర్లతో  టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని , కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
బంగాళాఖాతంలో  ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడనుందని , ఈ అల్పపీడనం   వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఈ ప్రభావంతో తెలంగాణలో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని,   లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి వేరే చోటికి తరలించాలని ఆన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!


రానున్న రెండురోజులు అదిలాబాద్ , నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి , మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట్, జోగులాంబ గద్వాల్ రెడ్ అలర్ట్ ప్రకటించిందని, ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టులను పరిశీలిస్తూ ఉండాలని , పోలీస్ అండ్ రెవిన్యూ, ఇరిగేషన్ శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు .

చెరువులు, కుంటలు, రహదారులు, వంతెనలు , తదితర వాటిపై అప్రమత్తంగా ఉండాలని ఆన్నారు.
మున్సిపల్ సిబ్బంది పాత భవనాలు, ఇళ్ళు, గోడలు వర్షానికి కూలిపోయే దశలో ఉన్న వారిని గుర్తించి ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
అనంతరం జిల్లా పాలనాధికారి రాజర్షి షా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ సంబంధిత కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలని ఆన్నారు.  ఓపెన్ బావులలో క్లోరినేషన్ తప్పనిసరిగా వేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలనీ తెలిపారు.
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతీ రోజూ నీటిని వేడి చేసి త్రాగాలని, వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
వాగులు వంకలు పొంగిపొర్లుతున్న సందర్భం లో ప్రజలు వాటిని దాటరాదని కోరారు.
ప్రాజెక్టులు ఓవర్ లోడ్ అవుతే వెంటనే గేట్లు ఎత్తివేయాలని , సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆన్నారు.
అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.

కలెక్టరేట్ తో పాటు జిల్లా, డివిజన్, మండల్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ , విద్యుత్ శాఖ లు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారం అందివ్వాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ శ్యామల దేవి, ఇరిగేషన్, రెవిన్యూ, ఆర్ అండ్ బి, డీపీఓ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!