వికారాబాద్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ శ్రీను నాయక్ రోడ్డుప్రమాదంలో మృతి
Thank you for reading this post, don't forget to subscribe!గతనెల 26 న వివాహం ఉండటంతో సెలవుపై వెళ్లిన శ్రీను నాయక్…..
కుటుంబంతో కలిసి దేవలయానికి వెళ్లి తండ్రితో కలిసి ఆటోలో వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఎస్ఐ శ్రీనునాయక్ అక్కడికక్కడే మృతి….
నల్గొండ జిల్లాలో ప్రమాదం
పెళ్లైన వారం రోజులకే వికారాబాద్ వన్‌టౌన్ ఎస్‌ఐ మృతి
వివాహమైన వారం రోజులకే వికారాబాద్ వన్‌టౌన్ ఎస్‌ఐ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఈఘటనలో ఎస్‌ఐతో పాటు ఆయన తండ్రి కూడా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చింతపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్యానాయక్ తండాకు చెందిన శ్రీను నాయక్ (30) వికారాబాద్ వన్ టౌన్ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనుకు గత నెల 26న వివాహం జరిగింది. ఈ క్రమంలో ఓడిబియ్యం కార్యక్రమం ఉండడంతో తన తండ్రి మాన్యానాయక్ (55)ను తీసుకొని హైదరాబాద్ నుంచి స్వగ్రామం మాడుగుల మండలం మాన్యానాయక్ తండాకు వెళ్లారు.
అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న అనంతరం తండ్రితో కలిసి హైదరాబాద్‌కు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో చింతపల్లి మండలం పోలెపల్లి రాంనగర్ గ్రామ పరిధిలోకి రాగానే హైదరాబాద్ నుంచి దేవరకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను నాయక్, అతని తండ్రి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న చింతపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన చింతపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నారు.
Recent Comments