ePaper
Wednesday, March 11, 2026
📄 ePaper

ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు రౌడీ షీటర్ల అరెస్ట్…

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

*రౌడీ షీటర్ షేక్ ఇర్ఫాన్ గంజాయి సేవించినందుకు అరెస్ట్...

*ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.

*పబ్లిక్ ప్లేస్ లో నందు, రోడ్లపై సిగరెట్ తాగుతూ, రాష్ డ్రైవింగ్ చేస్తూ, మద్యం సేవిస్తూ సోషల్ మీడియా నందు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై చట్టప్రకారం చర్యలు.
*మరొక కేసులో డబ్బులు వసూలు చేస్తూ బెదిరించిన వ్యక్తి అరెస్ట్.
*ఎగ్జిబిషన్ వ్యాపారి వద్ద బెదిరించిన నిందితుడు మోసిన్ అరెస్ట్...

— ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి

ఆదిలాబాద్ : పట్టణంలో గత రాత్రి రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని ఆదిలాబాద్ డిఎస్పి అది జీవన్ రెడ్డి తెలిపారు.

వివరాలలో మొదటి కేసు నందు షేక్ ఇర్ఫాన్ మన్నాన్ అనే రౌడీ షీటర్ సిగరెట్ తాగుతూ, రాష్ డ్రైవింగ్ చేస్తూ సోషల్ మీడియా నందు పోస్ట్ నందుకు అతనిని పోలీస్ స్టేషన్కు తీసుకురాగా, అనుమానంతో అతనిపై గంజాయి టెస్ట్ చేయగా, గంజాయి సేవించడం నిర్ధారణ కావడంతో, అతనిపై గంజాయి కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. కేసు వివరాలు Cr.No.205/2025 U/Sec 8 c r/w 20(b) (ii) (A), 27 (b) NDPS Act of PS Adilabad-I Town తెలిపారు.


అదేవిధంగా రెండవ కేసులో అదిలాబాద్ పట్టణంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఎగ్జిబిషన్ వ్యాపారితో సయ్యద్ మోసిన్ అనే వ్యక్తి డబ్బులు కావాలంటు బెదిరించడంతో అతనిపై ఎక్స్ట్రాషన్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. కేసు వివరాలు Cr.no 198/2025 u/sec 308(5) BNS కింద కేసు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. అతని నిన్న అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగిందని తెలిపారు.


సోషల్ మీడియా నందు పబ్లిక్ స్థలాలలో, రోడ్ల పై కత్తులతో, రాష్ డ్రైవింగ్ చేస్తూ, సిగరెట్ తాగుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!