
* బెదిరింపులకు పాల్పడి, ఇల్లు నిర్మాణ పనులకు అడ్డగించిన మాజీ కౌన్సిలర్ భర్త అరెస్టు రిమాండ్.
* మున్సిపాలిటీ నందు కోర్టుల నందు అక్రమ నిర్మాణం ఫిర్యాదులు చేసి డబ్బులు వసూలు.
* ఇల్లు నిర్మాణానికి అడ్డగించినందుకు ఇద్దరిపై కేసు నమోదు, ఒకరి అరెస్టు రిమాండ్.
* బాధితుడు మరియు వారి కుటుంబ సభ్యులకు మానసిక క్షోభ కలిగించిన నిందితులు.
* బాధితుని వద్దనుండి 6 లక్షలు డిమాండ్, రూ 90000 వసూలు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : అరెస్ట్ అయిన నిందితుడి పై ఇదివరకే పట్టణంలో 11 కేసులు నమోదు వివరాలను ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్ వెల్లడించారు.
ఆదిలాబాద్ పట్టణంలోని రాణి సతీష్ కాలనీకి చెందిన
నిందితుడు సోమ రవినీ అరెస్టు రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. రెండవ నిందితుడు 2) డివిఆర్ ఆంజనేయులు ( ఈ కేసు నందు రెండవ నిందితుడు డివిఆర్ ఆంజనేయులు అని జర్నలిస్టు గా విధులు నిర్వహిస్తున్నాడు ) పరారీలో ఉన్నట్లు తెలిపారు.

అదిలాబాద్ పట్టణానికి చెందిన ఆయుష్ మఖారియా (వయసు 28), బ్రాహ్మణవాడకు చెందిన వ్యాపారవేత్త, ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణంలోని మాజీ కౌన్సిలర్ భర్త సోమా రవి మరియు డివిఆర్ అంజనేయులు అనే ఇద్దరు వ్యక్తులు అతనిని తీవ్రంగా తీవ్రమైన వేదనకు గురిచేసి అతని వద్ద నుండి రూ.90,000/- బలవంతంగా వసూలు చేసిన ఘటనలో ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది.
ఫిర్యాదులో పేర్కొచ్చిన వివరాల ప్రకారం, పై ఇద్దరూ అనేక తప్పుడు ఫిర్యాదులను మున్సిపాలిటీలో సమర్పించి ఆయుష్ మఖారియా సొంతంగా కలిగిన ఆస్తిపై మ్యూటేషన్ మరియు బిల్డింగ్ అనుమతులను అడ్డుకున్నారని, వారి తప్పుడు ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటే రూ. 6 లక్షలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తూ, ముందుగా రూ. 90,000/- తీసుకున్నారని బాధితుడు తెలిపారు. వీరి చర్యల వల్ల తీవ్ర మానసిక వేధింపులకు గురైనట్టు పేర్కొన్నారు.
బాధితుడు DVR అంజనేయులుతో మాట్లాడిన ఆడియో రికార్డును సమర్పించడమే కాకుండా, అతను అట్రాసిటీ కేసులు పెట్టుతానని భయపెట్టినట్టు పేర్కొన్నాడు. అంజనేయులు ఇతరులను పంపి బెదిరింపులు చేయించడం, ఒప్పందానికి నొచ్చకపోతే శారీరక దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నట్టు తెలిపారు.
ఈ వ్యవహారంపై బాధితుని తండ్రి, తాతగారికి తీవ్రమైన మానసిక బాధలు, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినట్టు తెలిపారు. అనేక నెలలుగా అనిద్ర, తీవ్ర ఒత్తిడి కారణంగా వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, ఇది వారి ప్రాణాలకు కూడా ముప్పుగా మారే ప్రమాదం ఉన్నదని బాధితుడు పేర్కొన్నారు.
బాధితుడు తన కుటుంబం మీద జరిగిన ఈ అక్రమమైన, హింసాత్మక చర్యలపై గట్టి చర్యలు తీసుకుని సోమా రవి మరియు డివిఆర్ అంజనేయులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు మళ్లీ జరగకుండా నివారించాలని పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించారని ఆదిలాబాద్ ఒకటవ పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తెలియజేశారు.
రెండవ కేసు
ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం చేసిన ఘటనలో నిందితుడి అరెస్ట్ రిమాండ్
* రిమ్స్ నందు నర్సు ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ బాధితురాలు వద్ద నుండి 1,40,000 వసూలు
* బాధితురాలు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన మోసం
* అక్రమ కార్యక్రమాలు నిర్వహించే వారిపై జిల్లా పోలీసులు ఉక్కు పాదంతో అణచివేస్తారని హెచ్చరిక
* ఆదిలాబాద్ ఒకటవ పట్టణ సీఐ బి సునీల్ కుమార్
ఆదిలాబాద్ : రిమ్స్ నందు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ బాధితురాలు మరియు ఫిర్యాదు గారు అయినటువంటి మహిళ వద్ద లక్ష నలభై వేల రూపాయలు వసూలు చేసిన భూపాలపల్లికి చెందిన *రాజ్ కుమార్* అనే నిందితుడు ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బీ సునీల్ కుమార్ తెలిపారు. అక్రమ కార్యక్రమాలు నకిలీ దండాలు ప్రజలను మోసం చేసే ఎలాంటి వారిని విడిచి పెట్టేది లేదని జిల్లా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలతో వారిని అణచివేస్తుందని హెచ్చరించారు.
పూర్తి వివరాలలో …
బాధితురాలు మరియు ఫిర్యాదు దారు మహేశ్వరి ఆరోపించిన దాని ప్రకారం, ఆమె ANM కోర్సు చదివి, రిమ్స్ హాస్పిటల్, ఆదిలాబాద్‌లో శిక్షణ పొందింది. భూపాలపల్లికి చెందిన గజ్జే రాజ్‌కుమార్ అనే వ్యక్తి ద్వారా ఉద్యోగం వస్తుందని నమ్మి, గజ్జే రాజ్‌కుమార్ మాటలను నమ్మి, మహేశ్వరి తన ఖాతా నంబర్ నుండి జనవరి 12, 2021న ఎస్‌బిఐ ఖాతాకు ₹1,00,000/- (ఒక లక్ష రూపాయలు) చెల్లించింది. ఆ తర్వాత, జూలై 27, 2021న అదే ఖాతా నుండి మరో ₹40,000/- (నలభై వేల రూపాయలు) ఎస్‌బిఐ ఖాతాకు చెల్లించింది. మొత్తం కలిపి, ఆమె ఆ వ్యక్తికి ₹1,40,000/- (ఒక లక్ష నలభై వేల రూపాయలు) చెల్లించింది.

నిందితుడు ఉద్యోగం ఇప్పించే విషయంలో రోజురోజుకూ వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు మార్చి 30, 2025న, వారు ఉద్యోగం ఇవ్వలేనని లేదా డబ్బు తిరిగి ఇవ్వలేనని స్పష్టం చేశారు. ఆ వ్యక్తి మహేశ్వరికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అన్యాయంగా డబ్బు కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కావున, అతనిని ఈరోజు అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments